నాగ్ చైతన్యతో ఇంద్రగంటి?

జెంటిల్ మన్ తో తనేమిటో మరోసారి ప్రూవ్ చేసుకున్న డైరక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ మళ్లీ మరో సినిమాకు రెడీ అయిపోతున్నారు. ఈ మేరకు బేసిక్ లైన్ ను ఓ యంగ్ హీరో నాగ్…

జెంటిల్ మన్ తో తనేమిటో మరోసారి ప్రూవ్ చేసుకున్న డైరక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ మళ్లీ మరో సినిమాకు రెడీ అయిపోతున్నారు. ఈ మేరకు బేసిక్ లైన్ ను ఓ యంగ్ హీరో నాగ్ చైతన్యకు రెడీ చేసినట్లు తెలుస్తోంది. నాగ్ చైతన్య సినిమాలు రెండు అక్టోబర్,నవంబర్ లో విడుదలకు రెడీ అయిపోతున్నాయి. 

అది పూర్తయిన తరువాత రెండు సినిమాలు ప్రారంభమయ్యే అవకాశం వుంది. వాటిలో ఒకటి కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వుంటుంది. రెండవది ఇంద్రగంటిది  వుండే అవకాశం వుంది. ఈ మేరకు టెంటటివ్ గా ప్రాజెక్టు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సాయి కొర్రపాటి నిర్మాతగా వ్యవహరించే అవకాశం వుంది. 

ఇంద్రగంటి మోహన్ కృష్ణ కాస్త డిఫరెంట్ క్లాస్ సినిమాలు తీస్తారని పేరు వుంది. ఈ స్టయిల్ సినిమాల్లో నాగ్ చైతన్య ఇంతవరకు చేయలేదు. సో, ఇది కాస్త డిఫరెంట్ అయ్యే అవకాశం వుంది.