పూరి జగన్నాధ్ రియల్లీ గ్రేట్

నష్టాల్లో వున్నవాడికి లాభాలు వచ్చి, నాలుగు డబ్బులు వస్తే, ముందు తన సంగతి తాను చూసుకుంటాడు. అంతేకానీ తనలాగే నష్టాలు వచ్చిన వాడు గుర్తుకురాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ సంగతి వేరు. ఆయనలో కనిపించని…

నష్టాల్లో వున్నవాడికి లాభాలు వచ్చి, నాలుగు డబ్బులు వస్తే, ముందు తన సంగతి తాను చూసుకుంటాడు. అంతేకానీ తనలాగే నష్టాలు వచ్చిన వాడు గుర్తుకురాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ సంగతి వేరు. ఆయనలో కనిపించని ఫిలాసఫర్ వున్నాడు. డబ్బులు సంపాదించారు, పోగొట్టుకున్నారు, విజయాలు చూసారు, అపజయాలు చూసారు. కానీ దేనికీ చలించరు. అలాంటి పూరి జగన్నాధ్ కు ఇస్మార్ట్ శంకర్ రూపంలో ఓ మాంచి హిట్ వచ్చింది. డబ్బులు కూడా బాగానే వచ్చాయి.

నిజానికి కాస్త దాచుకోవడమో, వదులుకున్న ఆస్తులు కొనుక్కోవడమో చేసుకోవచ్చు. కానీ పూరి అలా ఆలోచించ లేదు. ఒకప్పుడు ఒకటో రెండో సినిమాలు తీసి, ప్రస్తుతం చేతిలో పనిలేకుండా, డబ్బులు కూడా లేకుండా వున్న కొంతమంది డైరక్టర్లకు సాయం చేయాలనే ఆలోచన చేసారు. ఎంతోకొంత మందికి, ఎంతోకొంత వంతున సాయం చేయాలని నిర్ణయించారు.

ఇరవై మంది డైరక్టర్లు, కో డైరక్టర్లు చిరుసాయం అందిస్తానని, సినిమాల నుంచి తమకు ఆదాయం వస్తున్నంతకాలం ఇలా కొనసాగిస్తానని పూరి ఒక ప్రకటనలో తెలిపారు. హీరోలకు ఎంతయినా ఇస్తారు, కానీ సాయం అంటే అంతగా ముందుకురాని ఇండస్ట్రీలో పూరి జగన్నాధ్ ఈ విధంగా చేయడం కచ్చితంగా మెచ్చుకోదగ్గ సంగతే.

సైరా 'గ్రేట్ ఆంధ్ర' స్పెషల్ స్టోరీ