సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు నారా రోహిత్. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటున్నాడు.. చేస్తున్నాడు..కానీ ఎక్కడో చిన్న లోపం.. సరైన బ్లాక్ బస్టర్ పడడం లేదు.. మీడయం రేంజ్ నుంచి పైకి వెళ్లాలని ప్రయత్నం అలాగే వుంది.. అందుకే ఈ సారి సరైన ప్రాజెక్ట్ సెట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇందుకోసం హీరోయిజం ను సరిగ్గా ఎలివేట్ చేసే దర్శకుడు పూరి జగన్నాధ్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ మేరకు సినిమా డిస్కషన్ల స్టేజ్ లో వుందని తెలుస్తోంది. ప్రస్తుతం పూరి కన్నడ సినిమా చేస్తున్నాడు. అది పూర్తయ్యాక కళ్యాణ్ రామ్ సినిమా వుంది. ఆ తరువాత మరో తెలుగు సినిమా డిస్కషన్ లో వుంది. అది కాకుండా నారా రోహిత్ సినిమా డిస్కషన్ లోకి వచ్చింది. అంటే మళ్లీ పూరి ఫుల్ బిజీ అయ్యేటట్లే కనిపిస్తున్నాడు.