మగాడి ఇంటెన్షన్ ఏమిటో తెలియని అమాయకురాలేం కాదు. ఆబగా తడుముకోవడం, అవకాశం ఉంటే లొంగదీసుకోవడం ఈ పరిశ్రమలో మగాళ్ల నైజం అనే తత్వం ఆమెకు సుపరిచితమే. స్త్రీ సాంగత్యం కోసమే నిర్మాతల అవతారం ఎత్తే వాళ్లూ, అవకాశాలిచ్చే పేరుతో లొంగదీసుకునే వాళ్లకూ కొదవే లేదు. మరి ఇలాంటి మనుషులను పడికట్టు పదాలతో విమర్శించడంతోనో.. వాళ్తు తోడేళ్లంటూ విరుచుకుపడటంతోనో.. లేక అంతర్గతంగా తనే మధనపడుతూ కూర్చోలేదామె. తనపై మోజు పెంచుకున్న వాళ్ల క్రేజ్ తో ఎంజాయ్ చేసింది.. చేస్తూనే ఉంది!
వయసు మీద పడుతున్నా.. ఆ ఒకనాటి డ్రీమ్ గర్ల్ కు తనను డ్రీమ్ గర్ల్ గా చూసే వాళ్లంటే ఎంతో ఇష్టం. వాళ్లతో చనువుగా ప్రవర్తించడం ఆమె ప్రత్యేకత. కేవలం శరీర ఆకర్షణతో ఆమెకు దగ్గరై, అవకాశాలు, డబ్బు పేరుతో ఆమెను లోబరుచుకున్న వారిని సన్నిహితులుగానే చూస్తుందామె. వాళ్లను ఆప్తులుగానే భావిస్తుంది.
తనను క్రేజీగా చూసే వారిని అభిమానించే తత్వం ఆమెది. ఆమెను తనివితీరా ఆస్వాధించడానికి మాత్రమే ఆమెతో అనుబంధాన్ని కొనసాగిస్తున్న వాళ్లతో కూడా ఆమె మనఃపూర్వకమైన బంధాన్ని కలిగి ఉంటుంది. అలాగే ప్రవర్తిస్తుంది!
విటుల్లాంటి వారే అయినా.. తనంటే పడిచచ్చిపోయే జనాలను, బిగ్ షాట్స్ ను తన అందానికి పడే మార్కుల లెక్కలుగానే చూస్తుందామె. వారిని అన్ని రకాలుగానూ ఆనంద పెట్టడం ఆమె ప్రత్యేకత.
ఆ మధ్య తన పాత పరిచయస్తుడు ఒకరు .. బాధ్యతాయుతమైన పదవి నుంచి రిటైరవుతున్న సమయంలో.. అతడిని ఎవరూ పట్టించుకోకపోయినా ఈ హీరోయిన్ ప్రత్యేకంగా అతడి వద్దకు వెళ్లింది. రిటైరవుతున్న వాడు.. ఏజైన వాడితో మనకు పనేం ఉంది అందరూ లెక్కలేస్తే, అతడితో శృంగారనుభవం ఈ హీరోయిన్ ను ఊరికే ఉండనీయలేదు పాపం. ప్రత్యేకంగా వెళ్లి మీడియా ముఖంగానే అభినందించింది. దానికి వచ్చిన కవరేజీని చూసి ముసిపోయింది.
ఎవరో ఏదో అనుకొంటారని మొహమాట పడలేదు. ఆమె మనస్తత్వమే అంత. లేని విలువలను పక్కన పెట్టి, ఉన్న కోరికలను కోరికలుగా చూస్తూ.. మగాడిని మగాడి గా ఎంటర్ టైన్ చేసే ఆడది మరి!