Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పూరి పై మహేష్ భరోసా ఏమిటో?

పూరి పై మహేష్ భరోసా ఏమిటో?

పూరి జగన్నాధ్-మహేష్ కాంబినేషన్ లో సినిమా వస్తుందని తెలిసి సినిమా అభిమానులు కాస్త ఆలోచనలో పడిన మాట వాస్తవం. ఎందుకంటే మహేష్ కెరీర్ ఫుల్ పీక్ లో వుంది..పూరి వ్యవహారం ఫుల్ డౌన్ లో వుంది. పూరి సరైన హిట్ ఏమిటి..అసలు హిట్ కొట్టి చాన్నాళ్లయింది. మహేష్ కోసం మహా మహా దర్శకులు వెయిటింగ్ లో వున్నారు. 

మరి ఏం చూసి పూరికి మళ్లీ చాన్సివ్వాలని మహేష్ అనుకుంటున్నాడన్నది మిలియన్ డాలర్ల క్వశ్చన్. పూరి ఓ పెద్ద హిట్..ఓ ఫ్లూక్ హిట్ మహేష్ కు ఇచ్చి వుండొచ్చు. కానీ ఇప్పుడు పూరి ట్రాక్ రికార్డు చూస్తే మాత్రం హిట్ ఇస్తాడనే నమ్మకం మాత్రం సగటు సినిమా ప్రేక్షకుడికి లేదు అన్నది వాస్తవం. 

నితిన్ తో, వరుణ్ తేజ తో ఏ విధంగా సినిమాలు చేసాడో. వాటి పర్యవసానం ఏమిటో తెలిసిందే. ఒక పక్క వివి వినాయక్, విక్రమ్ కుమార్, లింగు స్వామి లాంటి కాస్త మినిమమ్ గ్యారంటీ వున్న డైరక్టర్లు ఎందరో మహేష్ డేట్స్ కోసం చూస్తున్నారు. కానీ ఆయనేమో..అస్సలు గ్యారంటీ లేని పూరికి ఓకె చెప్పారు. దీని మర్మమేమిటో వాళ్లిద్దరికే తెలియాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?