పూరీ పంచ్ సరిగ్గానే వేసాడుగా

పూరిజగన్నాధ్ బేసిక్ గా మంచి రచయిత.డైలాగ్ వేసాడంటే, పంచ్ దిగిపోవాల్సిందే. ఇప్పుడు సుతిమెత్తగా అన్నా కూడా మెగాస్టార్ చిరంజీవి మీద వేసిన డైలాగ్ పేలాల్సిన రేంజ్ లోనే పేలింది. పూరి బర్త్ డే సందర్భంగా…

పూరిజగన్నాధ్ బేసిక్ గా మంచి రచయిత.డైలాగ్ వేసాడంటే, పంచ్ దిగిపోవాల్సిందే. ఇప్పుడు సుతిమెత్తగా అన్నా కూడా మెగాస్టార్ చిరంజీవి మీద వేసిన డైలాగ్ పేలాల్సిన రేంజ్ లోనే పేలింది. పూరి బర్త్ డే సందర్భంగా మీడియాతో మాట్లాడినపుడు సహజంగానే చిరు 150 వ సినిమా సంగతి ప్రస్తావనకు వచ్చింది.

దానికి పూరి సమాధానం చెబుతూ..స్టోరీ చెప్పాను. సగం కథ నచ్చిందని, మిగిలినది మరోసారి విని చెబుతా అన్నారు. ఆ తరువాత ఆయనే ఆ సగం నచ్చలేదని మీడియాతో చెప్పారు. అదేదో నాతో చెప్పి వున్నా, ఎక్కడ నచ్చలేదో చెప్పివున్నా మార్చి వుండేవాడిని…అన్నాడు పూరి.

ఇప్పుడు ఈ విషయంలో పూరిని అస్సలు తప్పు పట్టడానికి వీలు లేకుండాపోయింది. తెరవెనుక ఏం జరిగింది అన్నది పక్కన పెడితే, పూరి కథ చెప్పారు సెకండాఫ్ నచ్చలేదు అన్నది మెగా మాట..అది మీడియాకు చెప్పడం ఎందుకు, నాకు చెబితే నేను మారుస్తానుగా అన్నది పూరి మాట. 

విన్నవాళ్లు ఎవరైనా ఏమంటారు? అవును నిజమే కదా..నిజంగా పూరి సినిమా చేయాలి అన్న ఐడియా వుంటే, ఎక్కడ నచ్చలేదు..ఎందుకు నచ్చలేదు..ఏం చేస్తే బాగుంటుంది అన్నది చెప్పి వుండాల్సింది. అలా చేయలేదు అంటే పూరితో సినిమా చేయడం ఇష్టం లేక కావచ్చు. 

మొత్తానికి పూరి తెలివిగా మరోసారి బాల్ ను మెగాస్టార్ కోర్టులోకి తోసేసాడు.