కొత్త హీరోలకు పూరి లాంటి డైరక్టర్ సినిమా చేయాలనే వుంటుంది. సినిమా సంగతి ఎలా వున్నా, పూరి క్రియేట్ చేసే హీరోయిజం వేరు. రామ్ చరణ్ ను చిరుత తో ఇంట్రడ్యూస్ చేసిన పూరి తరువాత మళ్లీ అటు పక్క చూడలేదు. మెగా క్యాంప్ తో పూరి సంబంధాలు బెడిసాయని వచ్చిన గ్యాసిప్ లు కెమేరామెన్ గంగతో రాంబాబు సినిమాతో పటాపంచలైపోయాయి.
ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, నాగబాబు కొడుకు వరుణ్ తేజ రెండో సినిమా పూరితో వుంటుందని. ఈ మేరకు ఓ మాట అనేసుకున్నారని వినికిడి. మహేష్ బాబుతో సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్న పూరి, పనిలో పనిగా వరుణ్ తేజ కు కూడా ఓ లైన్ సెట్ చేసి వినిపించాడని, ఒకె అయిందని వార్తలు వినిపిస్తున్నాయి.
చకచకా సినిమాలు తీయగల సత్తా వున్న పూరి, ఇద్దరితోనూ సినిమాలు చేయడం అన్నది పెద్ద అబ్బురం కాదు. మళ్లీ మాట్లడితే, అఖిల్ కు కూడా కథ చెప్పేసినా ఆశ్చర్యపోనక్కరలేదు.