పూర్ణ కు ప్లస్ నా..లేక పూర్ణ మైనస్ నా?

పూర్ణ నటించిన తెలుగు సినిమాలెన్ని? అని అడిగితే సమాధానం చెప్పడానికి ముందు వెనుకలాడతారు కానీ, అదే పూర్ణ నటించిన హిట్ సినిమాలెన్ని? అని అడగండి..టక్కున..అవును ఒక్కటేగా అని చెప్పేస్తారు. కానీ అవును 2, లడ్డూబాబు,…

పూర్ణ నటించిన తెలుగు సినిమాలెన్ని? అని అడిగితే సమాధానం చెప్పడానికి ముందు వెనుకలాడతారు కానీ, అదే పూర్ణ నటించిన హిట్ సినిమాలెన్ని? అని అడగండి..టక్కున..అవును ఒక్కటేగా అని చెప్పేస్తారు. కానీ అవును 2, లడ్డూబాబు, ఇలా మరో ఒకటి రెండు డిజాస్టర్లు కళ్ల ముందు మెదుల్తాయి.  అందువల్ల పూర్ణ సినిమా ఏదయినా వస్తోంది అంటే, అది పూర్ణకు ప్లస్ అవుతుందా అనే ఆలోచించాలి. కానీ పూర్ణ వల్ల ఆ సినిమాకు ప్లస్ అవుతుందా అని కాదు.

ఇంతకీ విషయం ఏమిటంటే, ఇప్పుడు లేటెస్ట్ గా పూర్ణ నటించిన సినిమా వచ్చేనెల 11 న విడుదలకు రెడీ అవుతోంది. ఆలీ, సునీల్, ధన్ రాజ్, సప్తగిరి ఇలా చాలా మంది కమెడియన్ల బాటలో శ్రీనివాసరెడ్డి కూడా హీరోగా మారుతూ రూపొందించిన సినిమా. ఈ సినిమాలో శ్రీనివాస రెడ్డి పక్కన పూర్ణనే హీరోయిన్. సినిమా ను నలుగురు కలిపి లేపే ప్రయత్నం చేస్తున్నారు. అవుట్ రేట్ ఏడు కోట్లకు అమ్ముడుపోయింది. 

మరి ఈ సినిమాతోనయినా పూర్ణ సుడి తిరిగి ఓ మాంచి హిట్ ఖాతాలో పడుతుందా? చూడాలి, పూర్ణ అదృష్టం ఎలా వుందో? ఈ సినిమాతోనయినా పూర్ణ మంచి హిట్ కొడితే మరిన్ని చాన్స్ లు వెదుక్కుంటూ వస్తాయి. ఎందుకంటే టాలీవుడ్ కు ఇప్పుడు హీరోయిన్ల కొరత చాలా వుంది.