‘పుష్ప’ కథలో ఎన్టీఆర్ జీవితం?

సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమా కథ మీద రకరకాల వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఈ వార్తల సారాంశం ఏమిటంటే, నాన్నకు ప్రేమతో సినిమా చేసినపుడు డైరక్టర్…

సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమా కథ మీద రకరకాల వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఈ వార్తల సారాంశం ఏమిటంటే, నాన్నకు ప్రేమతో సినిమా చేసినపుడు డైరక్టర్ సుకుమార్ కు హీరో ఎన్టీఆర్ తో సాన్నిహిత్యం ఏర్పడింది. 

ఆ సాన్నిహిత్యంతో ఎన్టీఆర్ తన బాల్యం, యవ్వనం లో విషయాలు, ఫ్యామిలీ విషయాలు షేర్ చేసుకున్నారంట. వాటి స్ఫూర్తితోనే పుష్ప కథ కు బీజం పడిందని తెలుస్తోంది.

పుష్ప సినిమాలో హీరో తండ్రి ఆదరణకు దూరంగా పెరుగుతాడని, రెండో భార్య కొడుకు అని, దాంతో కసిగా పెరిగి తోటివారు అందరినీ జయంచి, ఓ స్టేజ్ కు వస్తాడని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. 

అలా ఓ స్టేజ్ కు వచ్చాక, తను చిన్నతనంలో మిస్ అయిన భోగం, యోగం, రాయల్ లైఫ్ ను సెకండాఫ్ లో చవిచూస్తాడట. సినిమా తొలిసగం అంతా అడవుల్లో లాగా వుంటుంద‌ని, ద్వితీయార్థం అత్యంత విలాసంగా స్టయిలిష్ గా వుంటుందని తెలుస్తోంది.

ఈ గ్యాసిప్ లు, కబుర్లు ఎంత వరకు నిజం అన్నది సినిమా వస్తే కానీ తెలియదు. అలా తెలియాలంటే కనీసం తొమ్మిది నెలలు ఆగాలి.

తెరాస ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్