వైకాపా నేత, సినిమా నిర్మాత, బిల్డర్ ఇలా అనేక హోదాలు వున్న పొట్లూరి వరప్రసాద్ అరెస్టు అంటూ ఈ రోజు పత్రికల్లో వచ్చిన వార్త కాస్త సంచలనం సృష్టించింది. ఎందుకంటే పివిపి అంటేనే సంచలనాలకు మారు పేరు. మహేష్ బాబు మహర్షి సినిమా విషయంలో చెన్నయ్ లో కోర్టు ద్వారా చెక్ పట్టి ఆ సినిమాలో నిర్మాణ భాగస్వామ్యం సాధించారు. అలాగే బండ్ల గణేష్ విషయంలో గట్టిగా హడావుడి చేసారు. తన స్వంత సంస్థలో పనిచేసే ఉద్యోగి విషయంలో కూడా కాస్త గడబిడ జరిగింది.
ఇక విజయవాడలో ఎంపీగా పోటీ చేసినపుడు సవాళ్లు ప్రతి సవాళ్లు, ట్విట్టర్ లో తరుచు విసిరే బాణాల సంగతి సరేసరి. ఇలాంటి నేపథ్యంలో తాను అమ్మిన విల్లా విషయంలో వచ్చిన గొడవలో పివిపిని అరెస్టు చేసారంటూ వార్తలు వచ్చాయి. ఓ పత్రిక అరెస్టు అని రాసింది. మరో పత్రిక కేసు బుక్ చేసారు అని రాసింది. ఏది నిజమో ఇంకా క్లారిటీ లేదు.
మొత్తానికి ఈసారి మాత్రం పీవీపీ కాస్త గట్టి పార్టీతోనే గొడవేసుకున్నట్లు కనిపిస్తోంది. పోలిటికల్ గా, ఆర్థికంగా గట్టి సౌండ్ పార్టీలతో పివిపి గొడవేసుకున్నట్లు కనిపిస్తోంది. పివిపి దగ్గర డాక్యుమెంటల్ ఎవిడెన్స్ గట్టిగానే వుంది కానీ, ఇక్కడ సమస్య ఏమిటంటే, రౌడీలతో వెళ్లి రుబాబు చేయడం అన్నది. అక్కడే పివిపి ఇరుక్కున్నారు.
ఏది ఏమైనా ఒక విషయం పివిపి అర్థం చేసుకోవాలి. తన దగ్గర పని చేసే ఉద్యోగి విషయంలో కావచ్చు, నిన్నటికి నిన్న విలా వ్యవహారం విషయంలో కావచ్చు, బెజవాడ రౌడీలను వాడారు పివిపి అన్నది కామన్ గా వినిపించింది. హైదరాబాద్ కు బెజవాడ రౌడీలను తీసుకువస్తున్నారు అన్న మాట పదే వినిపించడం పివిపికి అంత మంచి విషయం కాదు. ఇప్పడిప్పుడే తెలంగాణ-ఆంధ్ర అన్న మాటలు వినిపించడం తగ్గాయి. అలాంటిది విజయవాడ రౌడీలు హైదరాబాద్ కు వచ్చిన ఇక్కడి లోకల్స్ మీద రుబాబు చేస్తున్నారు అన్న కలర్ వస్తే, వ్యవహారం అగ్లీగా మారుతుంది.
ఈసారి పివిపి గొడవేసుకున్నవారు అటు భాజపా లీడర్ డికే అరుణ సన్నిహితులు, తెలంగాణ ప్రభుత్వంలో పలుకుబడి వున్నవారు అని తెలుస్తోంది. పైగా పివిపి కి సాన్నిహిత్యం వున్నా కూడా ఆంధ్ర సిఎమ్ జగన్ ఇలాంటి చిల్లర తగాయిదాలు అంటే చికాకు పడతారు. అందువల్ల అట్నుంచి కూడా సహకారం రాదు. పివిపి లీగల్ గా స్ట్రాంగ్ గా వుంటారు కనుక, అట్నుంచి నరుక్కు రావడం బెటర్.