భర్తను హత్య చేసి వేరే వ్యక్తితో జంప్

అక్రమ సంబంధం కోసం ఓ మహిళ ఏకంగా కట్టుకున్న భర్తను కడతేర్చింది. మూడు ముళ్లు వేసిన భర్త కంటే.. అక్రమ సంబంధమే ఆమెకు ఎక్కువైంది. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులకు…

అక్రమ సంబంధం కోసం ఓ మహిళ ఏకంగా కట్టుకున్న భర్తను కడతేర్చింది. మూడు ముళ్లు వేసిన భర్త కంటే.. అక్రమ సంబంధమే ఆమెకు ఎక్కువైంది. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులకు షాకయ్యే నిజాలు తెలిశాయి.

ఏజెన్సీ ప్రాంతమైన మారేడుమిల్లి మండలం కూడురులో భవానీ, సోమిరెడ్డి ఉంటున్నారు. వీళ్లకు పెళ్లయి పదేళ్లు పైనే అవుతుంది. అయితే అదే గ్రామానికి చెందిన సూర్యనారాయణతో భవానీ అక్రమ సంబంధం పెట్టుకుంది.

కొన్ని రోజులకు భార్యపై సోమిరెడ్డికి డౌట్ వచ్చింది. దీనిపై ఆమెను కాస్త గట్టిగానే ప్రశ్నించాడు. మాటమాట పెరిగింది. దీంతో కోపగించుకున్న భవానీ, భర్తను వదిలి సూర్యనారాయణ ఇంటికి వెళ్లిపోయింది. ఆమెను అనుసరిస్తూ సోమిరెడ్డి కూడా వెళ్లాడు.

ఆ రాత్రి భవానీ, సోమిరెడ్డి, సూర్యనారాయణ మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆవేశంలో భవానీ, సూర్యనారాయణ కలిసి సోమిరెడ్డిని చంపేశారు. దగ్గర్లోనే ఉన్న అటవీ ప్రాంతంలో అతడి మృతదేహాన్ని పడేశారు.

ఇంటికొచ్చిన భవానీ భర్త కనిపించడం లేదని చెప్పడంతో, స్థానికులు అడవిలో వెదికి సోమిరెడ్డి మృతదేహాన్ని గుర్తించారు. ఫిర్యాదు అందుకొని పోలీసులు రంగంలోకి దిగే సమయానికి సూర్యనారాయణ, భవానీ లేచిపోయారు. ప్రస్తుతం వాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పార్టీని ఏనాడూ పల్లెత్తు మాట కూడా అనలేదు

నిమ్మగడ్డ వ్యవహారంపై పూర్తి దర్యాప్తు