Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పివిపి-మహేష్ వ్యవహారం సెటిల్

పివిపి-మహేష్ వ్యవహారం సెటిల్

మొత్తానికి పివిపి సంస్థకు మహేష్ బాబుకు సెటిల్ మెంట్ కుదిరిపోయింది.గడచిన కొన్ని రోజులుగా నలుగుతున్నఈ వ్యవహారం పరిష్కారమైపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే, పివిపి సంస్థకు మహేష్ బాబు మరో సినిమా చేయాలని అగ్రిమెంట్ వుంది. అలాగే దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా. బ్రహ్మోత్సవానికి ముందే వంశీ పైడిపల్లి చెప్పిన లైన్ కు మహేష్ బాబు ఓకె అన్నాడు. అది బౌండ్ స్క్రిప్ట్ గా మారి రెడీ అయింది. ఈ లోగా బ్రహ్మోత్సవం ఫ్లాప్ అయింది. ఎలాగూ మరో సినిమా చేయాల్సి వుంది కదా, అప్పుడు లెక్కలు చూసుకుందా అనుకున్నారు పివిపి, మహేష్ బాబు. కానీ ఇంతలో కథ అడ్డం తిరిగింది.

పివిపితో మరో సినిమా చేయడం మహేష్ భార్య నమ్రతకు అంతగా ఇష్టం లేదంటూ వార్తలు వినవచ్చాయి. కానీ అసలు ట్విస్ట్ వేరే వుంది. పివిపి కి, దర్శకుడు వంశీ పైడిపల్లికి మధ్య చిన్న తేడా వచ్చింది. ఊపిరి సినిమా చేసిన వంశీ పైడిపల్లి, రెండో సినిమాగా పివిపికి మహేష్ బాబు సినిమా చేయాల్సివుంది. అయితే పివిపి ముచ్చటగా మూడో సినిమా కూడా అగ్రిమెంట్ చేయమని పట్టుపట్టినట్లు వినికిడి. అయితే పివిపి వ్యవహార శైలి అంతగా పొసగక, వంశీ పైడిపల్లి కాదని అనడమే కాకుండా, మహేష్ దగ్గరకు వెళ్లి వేరే ప్రొడ్యూసర్ అయితేనే సినిమా చేస్తా అని చెప్పేసాడట.

దాంతో మహేష్ ఆలోచనలో పడ్డాడు. పివిపిని కాదంటే అగ్రిమెంట్ వుంది..లేనిపోని తకరారు అని ఆలోచనలో మహేష్ కొంచెం ముందు వెనుక ఆలోచించారని తెలుస్తోంది. ఆఖరికి పివిపితో కొన్ని సిటింగ్ ల అనంతరం ఇద్దరికి మధ్య ఏ విధంగా సెటిల్ మెంట్ జరిగిందో కానీ, ప్రాజెక్టు రద్దు చేసుకున్నారు. అదే ప్రాజెక్టును, అంటే అదే కథ, అదే దర్శకుడి సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్ ల నిర్మాణంలో చేయాలని మహేష్ బాబు డిసైడ్ అయ్యాడు. అశ్వనీదత్ కు మహేష్ బాబు ఎప్పటి నుంచో సినిమా బాకీ. అలాగే దిల్ రాజు కూడా ఎప్పటి నుంచో మరో సినిమా అడుగుతున్నాడు. సో, ఆ విధంగా ఇద్దరికీ కలిపి మహేష్ ఈ ప్రాజెక్టును సెట్ చేసాడు. 

ఇంతకీ పీవిపీకి మహేష్ బ్రహ్మోత్సవం లాస్ ను ఏ విధంగా సెటిల్ చేసాడన్నదే తెలియాల్సి వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?