ఆర్ ఆర్ ఆర్ కు చురుగ్గా ఏర్పాట్లు

మొత్తానికి ఆ తేదీ దగ్గరకు వస్తోంది. రాజమౌళి-రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో దానయ్య నిర్మించే సినిమా ప్రారంభోత్సవం కోసం సెట్ ముస్తాబవుతోంది. డిసెంబర్ 15 నుంచి ముహుర్తాలు వుండవు కనుక, ఆ…

మొత్తానికి ఆ తేదీ దగ్గరకు వస్తోంది. రాజమౌళి-రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో దానయ్య నిర్మించే సినిమా ప్రారంభోత్సవం కోసం సెట్ ముస్తాబవుతోంది. డిసెంబర్ 15 నుంచి ముహుర్తాలు వుండవు కనుక, ఆ లోపు ముహుర్తం చేసి, ఓ వారం పది రోజులు షూట్ చేసి గ్యాప్ ఇవ్వాలని దర్శకుడు రాజమౌళి డిసైడ్ అయినట్లు బోగట్టా.

ఈ గ్యాఫ్ ఇవ్వడానికి కూడా తగిన కారణం వుంది. రమా రాజమౌళిల కుమారుడు కార్తీక్ పెళ్లి డిసెంబర్-జనవరి ప్రాంతంలోనే వుంది. ఆ వ్యవహారాల్లో రాజమౌళి కొంతకాలం బిజీ అవుతారు. అందువల్ల ఆ లోపుగానే ఈ సినిమా స్టార్ట్ చేసి, కాస్త షూట్ చేసి, గ్యాప్ ఇవ్వాలనుకుంటున్నారు.

ఎన్టీఆర్ అక్టోబర్ రెండోవారం తరువాత ఫ్రీ అయిపోతారు. అరవింద సమేత విడుదల అయిపోతే ఎన్టీఆర్ రెడీ. అయితే రామ్ చరణ్ రెడీ కావాల్సి వుంది. ఆయన సినిమా నవంబర్ రెండో వారం తరువాత కానీ ఫూర్తి కాదని తెలుస్తోంది. పది రోజులు గ్యాప్ తీసుకుని రామ్ చరణ్  దీని మీదకు వస్తాడు. తరువాత ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూస్తారు.

2020 విడుదల టార్గెట్ గా రాజమౌళి లేటెస్ట్ వెంచర్ ప్లాన్ చేస్తుండడం విశేషం.