అ..అ..ఆ కు సిజి సమస్యలు?

అక్టోబర్ ఫస్ట్ వీక్ డేట్ ఫుల్ డిమాండ్ అన్నంత టాక్ వచ్చింది ఆ మధ్యన. ముందుగా ఈ టైమ్ లో రవితేజ-శ్రీనువైట్ల కాంబినేషన్ లో రెడీ అవుతున్న అమర్ అక్బర్ ఆంథోని ని షెడ్యూలు…

అక్టోబర్ ఫస్ట్ వీక్ డేట్ ఫుల్ డిమాండ్ అన్నంత టాక్ వచ్చింది ఆ మధ్యన. ముందుగా ఈ టైమ్ లో రవితేజ-శ్రీనువైట్ల కాంబినేషన్ లో రెడీ అవుతున్న అమర్ అక్బర్ ఆంథోని ని షెడ్యూలు చేసారు. ఈలోగా విజయ్ దేవరకొండ బై లింగ్యువల్ నోటా సినిమాకు అదే డేట్ ప్రకటించారు.

కానీ ఇప్పుడు తెలుస్తున్న సంగతి ఏమిటంటే, ఆ రెండు సినిమాలు కూడా ఆ డేట్ కు రావడం లేదని. తెలుస్తోంది. నోటా సినిమా అక్టోబర్ 18న రావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 
అలాంటి పరిస్థితుల్లో అమర్ అక్బర్ ఆంథోని వచ్చేయవచ్చు. కానీ దానికి కూడా ఏదో సమస్యలు వచ్చినట్లు తెలుస్తోంది, అమెరికాలో చేయాల్సిన వర్క్ ఏదో ఇక్కడ బ్లూ మ్యాట్ లో చేసేసారని, దాంతో కాస్త సిజి వర్క్ అవసరం పడిందని, అందంతా జరిగే సరికి ఆలస్యం తప్పదని తెలుస్తోంది.

ఇక మరే సినిమా కూడా అక్టోబర్ ఫస్ట్ వీక్ లో రావాలనుకోవడం లేదు. ఎందుకంటే రెండో వారంలో అరవింద సమేత వస్తుంది. ఈ సినిమాలను థియేటర్లలోంచి లేపసే ప్రమాదం కచ్చితంగా వుంది. 
అందుకే వేరే సినిమాలు ఆ డేట్ కు షెడ్యూలు అయ్యాయి. వీటిలో శ్రీవిష్ణు నారా రోహిత్, శ్రియల వీర భోగ వసంత రాయలు సినిమా కూడా వుంది. అలాగే చిన్న సినిమా భలే మంచి చౌకబేరమ్ కూడా అదే రోజు విడుదల అవుతుంది. 

అంతకు ముందు వారం నాటకం సినిమా విడుదలకు రెడీ చేస్తున్నారు.