Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆర్ఆర్ఆర్ నైజాం @80 కోట్లు

ఆర్ఆర్ఆర్ నైజాం @80 కోట్లు

రాజమౌళి లేటెస్ట్ సెన్సేషన్ ఆర్ఆర్ఆర్. ఎప్పుడయితే ఈ సినిమా ఓవర్ సీస్ మార్కెట్ ఫైనల్ చేసి, అగ్రిమెంట్ చేసుకున్నారో, తెలుగు మార్కెట్ మీద కూడా అంచనాలు, అయిడియాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతానికి ఇంకా మార్కెట్ చేయాలని అనుకోవడం లేదు కానీ, అప్పుడే అంచనాలు, ఆఫర్లు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 

నైజాం ఏరియాకు ఆర్ఆర్ఆర్ రేంజ్ సినిమాలు కొనగలిగింది దిల్ రాజు, ఏషియన్ సునీల్ మాత్రమే. ఇద్దరూ ఆ సినిమా కోసం ప్రయత్నిస్తున్నట్లు బోగట్టా. అయితే ప్రస్తుతానికి రేటు ఓపెన్ కాలేదు, కానీ ఎవరి ప్రయత్నాలు వారు సైలంట్ గా చేసుకుంటున్నారు. నైజాం వాల్యూ 70 నుంచి 80 కోట్ల రేంజ్ లో వుంటుందని తెలుస్తోంది.

బాహుబలి 2 నైజాం 70 కోట్ల మేరకు వసూలు చేసింది. ఇప్పుడు రేట్లు, మల్టీ ఫ్లెక్స్ లు పెరిగాయి. పైగా ప్రభుత్వం కూడా రేట్లు పెంచుకునేందుకు మహర్షి సినిమాతో అవకాశం ఇవ్వడం ప్రారంభించింది. అందువల్ల అన్నీ కలిపి 70 నుంచి 80 మధ్యలో ఆర్ ఆర్ ఆర్ నైజాం రైట్స్ కు ఇవ్వడానికి ఏస్ బయ్యర్లు ఇద్దరూ పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. 

ఒక్క నైజాం నే 80 కోట్లు అంటే, ఇక కేవలం తెలుగు రాష్ట్రాల హక్కులే 200 కోట్లకు పైగా వుంటాయన్నమాట. 

ఇలాంటి డ్రామాలు టీడీపీకి కొత్తేం కాదు సుమా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?