రాజ్ తరుణ్-ఎనిమిది కోట్లు

రాజ్ తరుణ్ ఇప్పుడు డౌన్ ఫాల్ లో వున్నాడు. అది అందరికీ తెలిసిందే. స్వయంకృతాపరాధాలు కావచ్చు, రాంగ్ గైడెన్స్ కావచ్చు, మొత్తంమీద చేసిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ దగ్గర పల్టీకొట్టాయి. దానికన్నా పెద్ద సమస్య,…

రాజ్ తరుణ్ ఇప్పుడు డౌన్ ఫాల్ లో వున్నాడు. అది అందరికీ తెలిసిందే. స్వయంకృతాపరాధాలు కావచ్చు, రాంగ్ గైడెన్స్ కావచ్చు, మొత్తంమీద చేసిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ దగ్గర పల్టీకొట్టాయి. దానికన్నా పెద్ద సమస్య, రాజ్ తరుణ్ మార్కెట్ ఇప్పుడు కిందకి వెళ్లిపోవడం కాదు, మైనస్ లోకి జారిపోయింది.

పెద్ద బ్యానర్లు పిలిచినపుడు, కథ, డైరక్టర్ ముందు, బ్యానర్ కాదు, ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ నిర్లక్ష్యం చేసాడు. తనకు నచ్చిన వారికి, నచ్చిన కథతో, ఏదో ఒకటి చేసేసాడు. అన్నీ దారుణంగా ఫెయిల్ అయ్యాయి. దీంతో పెద్ద బ్యానర్లు రాజ్ తరుణ్ ను వదిలి వేరే హీరోలను ప్రమోట్ చేసాయి. 

ఇప్పుడు చేతిలో ఒక్క దిల్ రాజు 'లవర్' సినిమా మినహా మరోటిలేదు. అయితే ఈ సినిమా దిల్ రాజు ఏకంగా ఎనిమిది కోట్లు ఖర్చుచేయడం విశేషం. రాజ్ తరుణ్ రెమ్యూనిరేషన్, ప్యాడింగ్ ఆర్టిస్టులు, టెక్నికల్ టీమ్ అన్నీకలిపి 8 కోట్లకు డేకేసింది ఖర్చు. శాటిలైట్, డిజిటల్ ద్వారా నాలుగుకోట్లు రికవరీ వస్తోంది.

మిగిలిన నాలుగుకోట్లు థియేటర్ల మీదే లాగాలి. సినిమా ట్రయిలర్ చూస్తే, కథ రెగ్యులర్ ఫార్మాట్లోనే వున్నట్లు కనిపిస్తోంది. హీరో, హీరోయిన్లు ప్రేమించుకోవడం, హీరోయిన్ కు ఏదో ప్రమాదం, హీరో కాపాడే ప్రయత్నం చేయడం. ఇధే కనిపిస్తోంది ట్రయిలర్ లో. మరి ఇప్పుడు జనం రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలు చూడడంలేదు. లవర్ ను ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. 

జనం రిసీవ్ చేసుకోకపోయినా, నాలుగు కోట్లు లాగలేకపోయినా, రాజ్ తరుణ్ కొన్నాళ్లు ఖాళీగా వుండాల్సి వస్తుందేమో?