హీరో రానా సమర్పిస్తున్నాడు అంటే సమ్ థింగ్ సమ్ థింగ్ అనిపిస్తుంది. క్షణం సినిమా తరువాత డైరక్టర్ రవికాంత్ పేరపు అందిస్తున్న సినిమా కావడంతో మరి కాస్త ఆసక్తి. పైగా టైటిల్ కృష్ణ అండ్ హిస్ లీల అంటూ పెట్టేసరికి, కచ్చితంగా ఏదో వుంది వ్యవహారం అనే ఆసక్తి. ఇలా మొత్తం మీద జనాల దృష్టిని ఆకర్షించిన కృష్ణ అండ్ హింస్ లీల సినిమా టీజర్ బయటకు వచ్చింది.
క్షణం లాంటి థ్రిల్లర్ సినిమాను అందించిన రవికాంత్ ఈసారి సిద్దు జొన్నలగడ్డ హీరోగా సీరత్ కపూర్, శ్రద్ద శ్రీనాధ్, షాలిని లాంటి ముగ్గురు హీరోయిన్లతో సినిమా చేస్తున్నాడు. అది కూడా ఫుల్ యూత్ ఫుల్ రొమాంటిక్ మూవీ. టీజర్ కు సశాస్త్రీయంగా వినిపించేలా, పులిహార కలిపెనులే..బాగా కలిపెనులో అనే ఫన్నీ ఆర్ ఆర్ ను జోడించడంలోనే వైవిధ్యం తెలుస్తోంది.
మూడు హగ్ లు, ఆరు కిస్ ల టైపు సినిమా అని, అయితే అందులోనే ఫన్ మిక్స్ చేసారని అర్థం అవుతోంది. శ్రీచరణ్ పాకాల నేపథ్యసంగీతం అందించారు. మొత్తం మీద క్షణం సినిమా తరువాత మరో ఇంట్రస్టింగ్ సినిమా అందిచబోతున్నాడు రవికాంత్ అని టీజర్ చెప్పకనే చెప్పింది.