నిన్నటికి నిన్న అంటే బుధవారం వెంకీ-నాగ్ చైతన్య సినిమా ఓపెనింగ్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. బాబీ దర్శకుడు. మీడియాకు నో ఇన్విటేషన్. ఫోటోగ్రాఫర్లకు కూడా. కేవలం యూనిట్ ఫొటోగ్రాఫర్ మాత్రమే ఫొటోలు తీసారు. ఒకటి రెండు ఫోటోలు మాత్రం బయటకు వచ్చాయి. వాటిల్లో రానా లేడు. కానీ నిర్మాతలు ట్విట్టర్ లో పెట్టుకున్న ఒక్క ఫొటోలోనే రానా వున్నారు.
తీసినా ఆల్ మోస్ట్ ఆల్ ఫొటోల్లో రానా తప్ప మిగిలిన వాళ్లే ఎక్కువ. అలా అని రానా ఫంక్షన్ లో ఎక్కవసేపు లేడా? అంటే వున్నారు. కానీ రానాకు ఆయన తండ్రి సురేష్ బాబు ఫొటోలు తీయనీయలేదని ఆ సమయంలో అక్కడున్నవారు చెప్పిన సంగతి. దీనికి కారణం మరేమీ కాదు, రానా ఫిజికల్ బాగా అంటే బాగా తగ్గిపోవడమే అని తెలుస్తోంది. ఈ ఫంక్షన్ లో రానాను చూసిన వారు ఆశ్చర్యపోయారని తెలుస్తోంది.
బాహుబలిలో భల్లాల దేవగా కండలు తిరిగిన శరీరంతో కనిపించిన రానాయేనా ఇంతలా చిక్కిపోయింది అని వాళ్లలో వాళ్లు అనుకున్నారు. ఒకరిద్దరు విషయం బయటకు వదిలారు. రానా ఆరోగ్యంపై ఆ మధ్య విపరీతంగా వార్తలు వచ్చాయి. వాటిని సురేష్ బాబు రానా కూడా కొంతవరకు ఖండించారు. కానీ వినిపించే గుసగుసలు వినిపిస్తూనే వున్నాయి.
ఇలాంటి టైమ్ లో వెంకీ-చైతూల సినిమా ఓపెనింగ్ కు వచ్చిన రానా ఆరోగ్యంగానే కనిపించినా, చాలా సన్నగా, పీలగా కనిపించడం హాజరయిన వారిని ఆశ్చర్యపరచినట్లు బోగట్టా.