Advertisement


Home > Movies - Movie Gossip
ఎన్టీఆర్ చెప్పాడు.. రామ్ చేసి చూపించాడు

మొన్నటివరకు దసరా రేసులో ఒకే ఒక్క సినిమా ఉండేది. అదే ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత చిత్రం. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరాకు విడుదల చేస్తామంటూ చాలా రోజులుగా చెబుతూ వస్తున్నారు. అయితే వీళ్లు చెబుతున్నారు. రామ్ దాన్ని చేసి చూపించాడు.

అవును.. తన సినిమాను కూడా దసరా బరిలో నిలిపాడు రామ్. ఏకంగా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దసరా శుభాకాంక్షలతో అక్టోబర్ 18న వస్తున్నామంటూ ప్రకటించింది 'హలో గురు ప్రేమకోసమే' యూనిట్. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత.

నిజంగా అరవింద సమేత రేసులో ఉంటే దిల్ రాజు తన సినిమాను రిలీజ్ చేసేంత రిస్క్ చేయడు. సో.. ఎప్పట్నుంచో చెబుతున్నట్టు అరవింద సమేత దసరాకు వస్తుందా రాదా అనే డౌట్ ఇప్పుడు అందర్లో మొదలైంది. దసరాకు ఒకరోజు ముందు రామ్ సినిమా వస్తోంది.

కాబట్టి.. ఎన్టీఆర్ తన సినిమాను విడుదల చేయాలనుకుంటే సరిగ్గా దసరా రోజున (అక్టోబర్ 19) విడుదల చేయాలి. లేదంటే రామ్ సినిమా కంటే వారంరోజుల ముందు రిలీజ్ చేసుకోవాలి. దిల్ రాజు తన సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడంతో.. హారిక-హాసిని జనాలు ఏం చేస్తారో చూడాలి.

షెడ్యూల్స్ పరంగా చూసుకుంటే అరవింద సమేత కంటే రామ్ సినిమానే తొందరగా షూటింగ్ పూర్తిచేసుకోనుంది.