రానా..పూరి..కాస్టింగ్ కంపెనీలు

జుట్టు వుంటే ఎన్నిరకాల జడలైనా వేయచ్చని సామెత. సినిమా ఇండస్ట్రీలో కాస్త పలుకుబడి, సర్కిల్ వుంటే ఏమయినా చేసుకోవచ్చు. బహుశా అందుకే కావచ్చు, పూరి జగన్నాధ్ లాంటి దర్ళకుడు, రానా వంటి నటుడు కాస్టింగ్…

జుట్టు వుంటే ఎన్నిరకాల జడలైనా వేయచ్చని సామెత. సినిమా ఇండస్ట్రీలో కాస్త పలుకుబడి, సర్కిల్ వుంటే ఏమయినా చేసుకోవచ్చు. బహుశా అందుకే కావచ్చు, పూరి జగన్నాధ్ లాంటి దర్ళకుడు, రానా వంటి నటుడు కాస్టింగ్ కంపెనీలు స్టార్ట్ చేస్తున్నారు. సినిమాలకు నటులను అందించే సంస్థలే కాస్టింగ్ కంపెనీలంటే. 

ఈ సంస్థలు పలువురు నటులతో అగ్రిమెంట్ లు చేసుకుని, సినిమాలు తీయాలనుకునేవారికి సహకరిస్తాయి. సినిమాల్లో బుక్ అయితే వచ్చే పారితోషికంలో ట్వెంటీ పర్సంట్ తీసుకుంటాయి. నిజానికి పూరి, రానా లాంటి వాళ్ల లెవెల్ బిజినెస్ కాదు ఇది. అయినా ఎందుకటో ఆ బిజినెస్ లోకి దిగుతున్నారట ఇద్దరూ. అయితే దీని వెనుక వైనం వింటే ఓస్ ఇంతేనా అని కూడా అనిపిస్తుంది.

ముంబాయిలో ఓ ఇండివిడ్యువల్ కాస్టింగ్ ఏజెంట్ ఒకరు వున్నారట. అతన్నే హైదరాబాద్ లో కూడా తన కంపెనీ తరపున ఏక్ట్ చేయమని పూరి సెట్ చేసుకున్నాడట. పూరి కనెక్ట్ (పిసి) అనే సంస్థను పెట్టాడట. ఆ సంస్థకు సిఇఓ గా హీరోయిన్ చార్మి వుంటారని వినికిడి. సో, ఆ ఏజెంట్ ఆల్బమ్ కు పూరి పేరు తోడవుతుందన్నమాట. అంతే.

ఇక రానా వ్యవహారం వేరుగా వుంది. రామ్ గోపాల్ వర్మ రిలెటివ్ ఒకరు ముంబాయిలో ఎప్పటి నుంచో కాస్టింగ్ కంపెనీ నడుపుతున్నారు. ఆ కంపెనీని టేకోవర్ చేయాలని రానా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుడు ఆ కంపెనీ ముంబాయ్ నుంచే కాకుండా, హైదరాబాద్ నుంచి కూడా తన కార్యకలాపాలు స్టార్ట్ చేస్తుందన్నమాట.

సరైన ఫేస్ లు దొరకాలే కానీ, వాళ్లని తమ దగ్గర లాక్ చేసి, హీరో హీరోయిన్లను చేస్తే, ఇక డబ్బులే డబ్బులు.  బహుశా అందుకే కావచ్చు పూరి, రానా లాంటి వాళ్లు కూడా ఈ రంగంలోకి వస్తున్నారు.