జూనియర్ ఎన్టీఆర్ టైమ్ అంతగా బాగున్నట్లు లేదు. అతగాడి కెరియర్ కు బూస్ట్ అవుతుందనుకుంటున్నా రభస సినిమా ఇబ్బందుల్లో చిక్కుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వివాదాలు తీవ్రమై, కోర్టు మెట్లు, ఎక్కాయో, ఎక్కుతున్నాయో అన్న దశలో వున్నాయని వినికిడి.
ఈ ప్రాజెక్టుతో ప్రమేయం వున్న ఆదిత్య మ్యూజిక్(అడియో), జెమిని టీవీ (శాటిలైట్) ఎన్టీఆర్, బెల్లంకొండ, ప్రసాద్ ల్యాబ్ ఇలా ప్రతి ఒక్కరికీ ఓ ముంబాయి సంస్థ , సినిమా విడుదలపై నోటీసుల ఇచ్చిందని సినిమా వర్గాల్లో వార్త చక్కర్లు కొడుతోంది.
నిజానికి ఈ వివాదం సెటిల్ మెంట్ దశలోనే వీగిపోయేదని, కానీ బెల్లంకొండ బిగుసుకు కూర్చోవడంతో ఇంతవరకు వచ్చిందని కూడా సణుగుళ్లు వినిపిస్తున్నాయి. నిజాలేమిటో, కొన్ని రోజుల్లో తేలిపోతుంది