Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రాహుల్ రవీంద్రన్-రష్మిక

రాహుల్ రవీంద్రన్-రష్మిక

రష్మిక తెలుగులో కనిపించి ఏడాది దాటిపోతోంది.  అయితే అలా అని రష్మిక ఖాళీగా ఏమీ లేదు. తెలుగులో రెండు ప్రాజెక్టులు రెడీ అవుతున్నాయి. హిందీలో రెండు వున్నాయి.  

ఇవి కాకుండా మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.. గీతా సంస్థలో హీరోయిన్ కీలకపాత్రలో తయారయ్యే ఓ సినిమాకు రష్మిక ఓకె చెప్పింది.

ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. గతంలో చిలసౌ అనే మంచి సినిమా అందించాడు. మన్మధుడు 2 అనే నాగార్జున అతి పోకడల సినిమాతో మూలన పడ్డాడు. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లకు అవకాశం వచ్చింది.  బ్యాచులర్, 18 పేజెస్ సినిమాల తరువాత మళ్లీ రెండు సినిమాలకు గీతా2 సంస్థ శ్రీకారం చుడుతోంది.

అందులో ఒకటి కరుణకుమార్ డైరక్షన్ లో రావు రమేష్, ప్రియదర్శి, అంజలి నటించే మలయాళీ సినిమా నయాట్టు రీమేక్ . రెండవది రష్మిక నటించే రాహుల్ రవీంద్రన్ సినిమా. ఈ సినిమాలు అన్నింటికీ బన్నీ వాస్ నిర్మాత. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?