Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రాహుల్ రవీంద్రన్.. తరువాత ఏంటీ?

రాహుల్ రవీంద్రన్.. తరువాత ఏంటీ?

తొలి సినిమా చి.ల.సౌ తోటే ఓ వైవిధ్యమైన డైరక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు రాహుల్ రవీంద్రన్. ఆ వెంటనే మళ్లీ అన్నపూర్ణ సంస్థలో సినిమా టేకప్ చేసాడు. నాగార్జునతో మన్మధుడు 2 సినిమా చేసేసాడు. అంతే కాదు మళ్లీ అక్కడే చైతన్యతో ఓ సినిమా చేయడానికి ఓకె చేయించేసుకున్నాడు.

ఆ విధంగా ఒకే సంస్థ హీరోలతో మూడు సినిమాలు కిట్టీలో వేసుకున్నాడు రాహుల్ రవీంద్రన్. అయితే ప్రస్తుతం చైతన్య ఖాళీ లేడు. వెంకీ మామ తరువాత శేఖర్ కమ్ముల సినిమా చేయాల్సివుంది. అలాగే అన్నీ కుదిరితే మేర్లపాక గాంధీ డైరక్షన్ లో ఓ సినిమా చేయాల్సి వుంది. అలాగే దిల్ రాజుకు ఓ సినిమా చేయాల్సివుంది.

అందుకే ఈలోగా బయట సంస్థకు ఓ సినిమా చేసే ఆలోచనలో రాహుల్ రవీంద్రన్ వున్నట్లు తెలుస్తోంది. తనదగ్గర వున్న రెండు మూడు స్క్రిప్ట్ లను యంగ్ హీరోలకు వినిపించే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్ దగ్గర ఒకటి, రెండు అడ్వాన్స్ లు వున్నాయి. వాటిలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ ది కూడా వుంది.

రాహుల్ రవీంద్రన్ మరి ఏ హీరోతో తరువాత సినిమా చేస్తాడో అన్నది కాస్త ఆసక్తికరమే. 

జనసేన... బతికి ఉంటేనే బేరముంటుంది!

రాహుల్ తో రచ్చ చేసిన రకుల్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?