Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సాహో.. లేటుగా అయినా!

సాహో.. లేటుగా అయినా!

బాహుబలి ప్రభాస్ భారీ సినిమా సాహో. ఈ సినిమా గురించి ఏం తెలుసు అని సగటు తెలుగు ప్రేక్షకులను అడిగితే, ప్రభాస్ పేరు ఎక్కువగా చెబుతారు. మరి కొద్దిమంది బ్యానర్ పేరు, డైరక్టర్ పేరు చెబుతారు. ఇంకా మరి కొంతమంది శ్రద్ధాకపూర్ పేరు చెప్పగలుగుతారు. అంతకు మించి ఈ సినిమా విశేషాలు పెద్దగా తెలియదు ఎవరికీ.

దీనికి కారణం మరేంకాదు, ఎక్కువగా ఇతర భాషల నటులు వుండడం ఒక కారణం. సినిమా మేకర్లు, సినిమా విశేషాలను ఎక్కువగా బయటకు చెప్పకపోవడం మరోకారణం. ఇక ఇప్పుడు టైమ్ వచ్చింది. సినిమా విడుదల దగ్గర పడింది. ఇప్పుడు సినిమాలో ఎవరున్నారు? ఏమిటి? అన్నది రివీల్ చేయడం ప్రారంభించారు.

తొలిసారిగా సినిమాలో కీలకపాత్ర పోషించిన నీల్ ముఖేష్ ను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ వదిలారు. ఇతగాడు ఒక తమిళ సినిమా, ఒక తెలుగు సినిమా ద్వారా తెలుగువారికి కాస్త పరిచయమే. అయితే సాహో లాంటి పెద్ద సినిమాలో నటించడం ఇదే తొలిసారి.

ఇలా ఇకపై ఒక్కోటిగా సాహోలోని పాత్రలను పరిచయం చేసే కార్యక్రమం చేస్తుందట నిర్మాణ సంస్థ. ఆగస్టు 30 విడుదల దిశగా రెడీ అవుతున్న సాహోని యువి సంస్థ నిర్మిస్తోంది.

జనసేన... బతికి ఉంటేనే బేరముంటుంది!

రాహుల్ తో రచ్చ చేసిన రకుల్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?