‘రైతు’ పై మల్లగుల్లాలు?

బాలయ్య బాబు, 101 వ సినిమా అనగానే రైతు అనేంతగా ప్రచారం జరిగిపోయింది. పైగా ఈ సినిమా కోసం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ను ఓ కీలక పాత్రకు ఒప్పించారన్న ప్రచారం కూడా జరిగింది.…

బాలయ్య బాబు, 101 వ సినిమా అనగానే రైతు అనేంతగా ప్రచారం జరిగిపోయింది. పైగా ఈ సినిమా కోసం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ను ఓ కీలక పాత్రకు ఒప్పించారన్న ప్రచారం కూడా జరిగింది. కృష్ణవంశీ ఈ సినిమాకు దర్శకుడు. వైఎస్ అభిమాన అనుచర గణంలోని కీలక వ్యక్తి ప్రియదర్శిని రామ్ ఈ సినిమాకు కథ అందించారు. 

భవ్య సంస్థ ఈ సినిమాను నిర్మించేందుకు డిసైడ్ అయిపోయింది. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్న వదంతులు వేరుగా వున్నాయి. ఈ ప్రాజెక్టు పై మల్లగుల్లాలు పడుతున్నారని వినిపిస్తోంది. దీనికి కారణం హీరో బాలకృష్ణ తన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసి, తరువాతి సినిమాకు రెడీ అయిపోయారు. 

కానీ దర్శకుడు కృష్ణ వంశీ ఇంకా తన నక్షత్రం సినిమా పని మీదే వున్నారు. ఆ సినిమా ఇంకా మరో రెండు నెలలు పడుతుందని తెలుస్తోంది. ఆ తరువాత అది విడుదల. అంతా కలిపి కనీసం మూడు నెలలు. అంటే మూడు నెలల పాటు బాలయ్య బాబు ఖాళీగా వుండాలి. కానీ బాలకృష్ణ ఆలోచన వేరుగా వుంది. వెంటనే సెట్ మీదకు వెళ్లిపోయి, జూన్ నాటికి మరో సినిమా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. 

అందుకే ఈ మూడు నెలల గ్యాప్ లేకుండా ఎలా చేయాలి? లేదా ఈ గ్యాప్ లో ఏం చేయాలి? అని డిస్కషన్లు నడుస్తున్నట్లు తెలుస్తోంది.