cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

రాజ్ తరుణ్ ‘టాక్సీవాలా’ ఎందుకు కాలేదు?

రాజ్ తరుణ్ ‘టాక్సీవాలా’ ఎందుకు కాలేదు?

విజయ్ దేవరకొండ హీరోగా రాబోతున్న సినిమా టాక్సీవాలా. మే 18న విడుదల కాబోతోంది. కారులో దెయ్యం అన్న పాయింట్ తో రాబోతున్న సినిమా ఇది. అయితే, ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు బదులు అసలు రాజ్ తరుణ్ టాక్సీవాలాగా కనిపించాల్సి వుందని తెలుస్తోంది. ఎందుకంటే ఈ కథను ముందుగా తీసుకెళ్లింది రాజ్ తరుణ్ దగ్గరకేనట. అయితే తనకు ఆ కథ నచ్చలేదని రాజ్ తరుణ్ చేయనన్నాడని తెలుస్తోంది.

శరీరం నుంచి ఆత్మను వేరు చేయడం అన్న పాయింట్ లాంటిది ఏదో సినిమాలో వుందట. అది అంతా కామన్ ఆడియన్స్ కు పడుతుందా? లాజికల్ గా వుంటుందా? అని రాజ్ తరుణ్ సందేహించినట్లు తెలుస్తోంది. పైగా కమెడియన్ నగేష్ నుంచి చాలా మంది కారులో దెయ్యం సినిమాలు చేసారు. అందువల్ల మళ్లీ చేస్తే ఎలా వుంటుందో అని రాజ్ తరుణ్ డవుట్ పడ్డట్లు సమాచారం.

దాంతో కథ రాజ్ తరుణ్ దగ్గర నుంచి విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్లింది. దీనివల్ల విజయ్ కు మాంచి లాభమే వచ్చింది. ఈ సినిమా ఓవర్ సీస్ రైట్స్ ఆయన తీసుకుని థర్డ్ పార్టీకి అమ్మేసారు. దాంట్లో మంచి లాభమే వచ్చిందని వినికిడి. పైగా నిర్మాతలు కూడా బాగానే లాభం చేసుకున్నారు. తక్కువ బడ్జెట్ తో తీసి, శాటిలైట్, డిజిటల్ ద్వారానే వెనక్కు రాబట్టుకున్నారని తెలుస్తోంది.