రాజ్ తరుణ్ ..బీ కేర్ ఫుల్

టాలీవుడ్ లో కనపడని వ్యవహారాలు చాలా వుంటాయి. అదృష్టం వుంటే ఫరవాలేదు కానీ, లేదూ అంటే దెబ్బేయడానికి చాలా పన్నాగాలు రెడీ అవుతాయి. ఇప్పుడు రాజ్ తరుణ్ ఆ డేంజర్ జోన్ లో వున్నాడు.…

టాలీవుడ్ లో కనపడని వ్యవహారాలు చాలా వుంటాయి. అదృష్టం వుంటే ఫరవాలేదు కానీ, లేదూ అంటే దెబ్బేయడానికి చాలా పన్నాగాలు రెడీ అవుతాయి. ఇప్పుడు రాజ్ తరుణ్ ఆ డేంజర్ జోన్ లో వున్నాడు. కాస్త మరొక్కటి లేదా, రెండు హిట్ కొడితే తప్ప ఆ డేంజర్ జోన్ దాటడు. నిజానికి కుమారి సినిమా ఫలితంపై చాలా మంది ఆసక్తిగా ఎదురుచూసారు. అలా చూసిన వారిలో హీరోలు వున్నారు..తమకు చాన్సివ్వలేదనుకున్నవారు వున్నారు. అయితే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూడు హిట్ లు కొట్టడమే కాదు..తనకు నటనా పరంగా స్టామినా వుంది అని ప్రూవ్ చేసుకున్నాడు రాజ్ తరుణ్.

ఎవరు ఎంత చెప్పినా, అలా అని చెప్పినవారిని తిట్టినా, వాస్తవం వాస్తవమే. టాలీవుడ్ అంటే ముమ్మాటికీ, నూటికి నూరుపాళ్లు కులాల ఈక్వేషనే. అది టాలీవుడ్ కు సంబంధించినంత వరకు ఈ రంగం ఆ రంగం అన్నది లేదు. రెండు ప్రామినెంట్ కులాల్లో దేంట్లో ఒకదానికి చెందితే ఓకే. కొంతవరకు సస్టెయన్ కావచ్చు. అలా కాకుంటే మాత్రం కేవలం అదృష్టం..ప్లస్ టాలెంట్ కలిసిరావాలంతే. మరో మార్గం లేదు. 

ఇప్పుడు ఈ రెండింటికి చెందని రాజ్ తరుణ్ ఒక్కసారి లైమ్ లైట్ లోకి వచ్చాడు. మరో రెండేళ్ల వరకు డైరీ ఖాళీలేదు. పైగా సోకాల్డ్ వారసులకు లేని టాలెంట్ వుంది. దీనికి తోడు ఆర్జీవీ లాంటి వాళ్లు రాజ్ తరుణ్ ను పొగడడం సంగతి అలా వుంచితే, అతడ్ని చూపించి వారసులను విమర్శిస్తున్నారు. దీంతో వాళ్ల ఆర్జీవీని ఏమీ అనకపోవచ్చు..పట్టించుకోకపోవచ్చు కానీ, రాజ్ తరుణ్ పై పరోక్షంగా కాస్తయినా జెలసీ పెంచుకునే ప్రమాదం వుంది.

అవకాశం దొరికిన నిర్మాతలు, దర్శకులతో ప్రమాదం లేదు. ఎందుకంటే ఎక్కడ హిట్ లు వుంటే అక్కడ వాలిపోతారు. కానీ అవకాశం దొరకనివారు మాత్రం నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి అవకాశమే ఎక్కువ. అబ్బే ఇదంతా అబద్దం..ఇండస్ట్రీ అంటే టాలెంట్ మాత్రమే. అది వుంటే ఎవరు ఏమీ చేయలేరు లాంటివి అన్నీ పైపై సుత్తి కబుర్లు మాత్రమే. లోలోపల ఏం డిస్కషన్లు నడుస్తాయి..ఎవరు ఎలా మాట్లాడతారు..అన్నది ఇండస్ట్రీలో వున్నావారికి తెలిసిన సంగతే.

రాజ్ తరుణ్ ఇక ఇప్పుడు కావాల్సింది జాగ్రత్త మాత్రమే. తనపై, తన ఆటిట్యూడ్ పై వదంతులు రాకుండా జాగ్రత్త పడాలి. నా వైఖరి, నా పద్దతి నాది అనుకుంటే టాలీవుడ్ లో మనగలగడం కష్టం అని తెలుసుకోవాలి. ఇష్టం వున్నా లేకున్నా, నలుగురితో కలిసి ముందుకు సాగాల్సిందే. మొన్నటికి మొన్న ఆర్జీవీకి ఫోన్ చేతికిచ్చి ఇబ్బందిపడే సిట్యువేషన్ తెచ్చుకున్నట్లు మరి తెచ్చుకోకూడదు. 

అన్నింటికి మించి పెద్ద హీరోలను చూసి వాతలు పెట్టుకునే విధంగా మాస్ యాక్షన్  సినిమాల జోలికి వెళ్లకూడదు..ఆ ఇమేజ్ కోసం తహతహలాడకూడదు. ఇప్పటిదాకా తరుణ్, ఉదయ్ కిరణ్, దగ్గర నుంచి వర్తమానం లో వున్న చాలా మంది టీనేజ్ హీరోల వరకు చేసిన తప్పు అదే. యాక్షన్ ఓరియెంటెడ్ మాస్ ఇమేజ్ కోసం ట్రయ్ చేసిన ప్రతి టీనేజ్ హీరో కిందకు జారిపోయాడు. నిఖిల్ ఆ తప్పును వెంటనే సరిదిద్దుకుని లైన్లో పడ్డాడు.

అందుకే రాజ్ తరుణ్ ఆ తప్పు చేయకూడదు. టాలెంట్ ఎక్కువ వున్నవాళ్ల దగ్గర మరో సమస్య వుంటుంది. కాస్త తక్కువ టాలెంట్ వున్నవాళ్లని చూస్తే, పెద్దగా పట్టించుకోకపోవడం..అది నిర్మాత, హీరో, దర్శకులు ఎవరైనా సరే, ఇండస్ట్రీలో అది పనికి రాదు. నలుగురిని పలకరించుకుంటూ పోవాల్సిందే..రాజ్ తరుణ్ కు ఇది ఇంకా అలవాటు కాలేదు.

ఇలా ఇన్ని సుద్దులు చెబుతున్నది ఎవరు అనుకుంటున్నారు….ఇండస్ట్రీలోనే వున్న న్యూట్రల్ వర్గాలు..వారసులు కాకుండా రాజ్ తరుణ్ లాంటి టాలెంట్ వున్నవారు ఏ వర్గానికి చెందినవారైనా పైకి వస్తే చూసి సంతోషించేవారు.

సో..రాజ్ తరుణ్..బీ కేర్ ఫుల్.