బాహుబలి సినిమా విడుదల ఓ కొలిక్కి వస్తున్న కొద్దీ దాని రూపకర్త రాజమౌళికి అన్ని వైపుల నుంచి వత్తిడి పెరిగిపోతోంది.రాజమౌళి బాహుబలికి కేవలం దర్శకుడు మాత్రమే కాదు..కర్త..కర్మ..క్రియ అన్నీ ఆయనే. అన్నీ ఆయన కనుసన్నలలో జరగాల్సిందే. దాంతో ఆయనపై విపరీతమైన ప్రెజర్ పడుతోంది.
ఇప్పిటికే అడియో ఫంక్షన్ ఒకసారి క్యాన్సిల్ అయింది. సరే, స్పాట్ మార్చి, కొత్త వెన్యూ, కొత్త డేట్ ప్రకటించారు. ఇప్పుడు ఆడియో లీక్ అయింది. క్లారిటీ వుందో,లేదో వేరే సంగతి. మొత్తానికి ఆ థ్రిల్ పోయింది. అడియో ఫంక్షన్ చేయాల్సిందే..ఎందుకంటే టీవీ 5 కు కోటిన్నర మొత్తానికి హక్కులు అమ్మారు కాబట్టి.
మరోపక్క రాజమౌళితో సంబంధం లేకుండానే కరణ్ జోహార్ జూలై 10 విడుదలంటూ హడావుడి ప్రారంభించేసాడు. అప్పటికి సినిమా అన్ని విధాలా రెడీ అవుతుందా అన్నది ఇంకా సందేహంగానే వుంది.
దీంతో రాజమౌళి ఒక పక్క ఆ పనులు చూడాల్సి వస్తోంది. ఇంకో పక్క అడియో ఫంక్షన్ ప్లానింగ్. ఇంత టెన్షన్ పడే బదులు కాస్త వెనక్కు తోద్దాం విడుదల తేదీని అంటే కరణ్ జోహార్ ససేమిరా అంటున్నట్లు వినికిడి. దాంతో రాజమౌళి క్యాంప్ లో టెన్షన్ టెన్షన్ గా వుందని వినికిడి. జూలై పదికి సినిమా తీసుకురాకపోతే కొత్త ఇబ్బందులు తలెత్తే అవకాశం వుందని, ఎలాగైనా డేట్ కు రావాలని కిందామీదా పడుతున్నారని వినికిడి.