బాహుబలి విడుదలకు మరో నెల టైమ్ వుంటే బాగుండునని రాజమౌళి అనుకున్నారా? ప్రభాస్ మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విషయాల్లో ఇది ఒకటి. మరొక్క నెల సమయం వుంటే ఇంకా బాగుండేదని రాజమౌళి అనుకున్నారని ప్రభాస్ వెల్లడించారు. అయితే, 'నీకు నెల కాదు, ఏడాది టైమ్ ఇచ్చినా చెక్కుతూనే వుంటావు' అని రమా రాజమౌళి అన్నారని కూడా చెప్పాడు.
అంటే ఇప్పటికీ ఇంకా క్యూబ్ అప్ లోడ్, డిస్క్ లు ఇంకా రెడీ కాలేదు. సోమవారం రాత్రికి రెడీ అవుతాయిని తెలుస్తోంది. సోమవారం నాడు రాజమౌళి అన్ని పనులు పూర్తి చేసుకుని, ముంబాయి నుంచి తిరిగి వస్తున్నారు. అంటే పాపం, రాజమౌళి అనుకున్న మరో నెల సమయం అన్నది నిజమే అన్నమాట. మరీ ఇంత టెన్షన్ పడకుండా, కాస్త ఊపిరి పీల్చుకుంటూ వర్క్ పూర్తి చేసేవారు.