దర్శకుడు రాజమౌళి మాటంటే మాటే. మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తానని ఎప్పటి నుంచో చెబుతున్నారు. కానీ ఆ ఎప్పుడు అన్నది తెలియడం లేదు. ప్రస్తుతం మహేష్ 24వ సినిమా కొరటాల శివతో జరుగుతోంది.
25వ సినిమా వంశీ పైడిపల్లితో కమిట్ అయ్యారు. ఆ సినిమా పూర్తయ్యే సరికి 2018 సమ్మర్ దాటిపోతుంది. ఆ తరువాత 26వ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో వుంది. ఆ తరువాత 27వ సినిమా 14రీల్స్ వాళ్లుకు కమిట్ అయ్యారు.
మరి 14రీల్స్ వాళ్లకు రాజమౌళి సినిమా చేస్తారేమో అనుకుంటే, ఆ వ్యవహారం వేరు. రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ సినిమా కెఎల్ నారాయణ నిర్మించాల్సి వుంది.
అందువల్ల 14 రీల్స్ వారు వేరే డైరక్టర్ ను చూసుకుంటారు. ఆ సినిమా 2019లో వుంటుంది. అంటే రాజమౌళి సినిమా 2019 చివరిలో కానీ, 2020లో కానీ వుండాల్సి వుంటుంది. ఏమిటో ఈ అడ్వాన్స్ బుకింగ్ లు.