రాజమౌళి నెక్ట్స్ సినిమా ఏంటనేది ఇంకా తెలియలేదు. ఎలాంటి కథతో వస్తున్నాడు.. హీరో ఎవరు లాంటి డీటెయిల్స్ ఏవీ బయటకు రాలేదు. కానీ బ్యానర్ మాత్రం దాదాపు ఓకే అయినట్టు కనిపిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై జక్కన్న సినిమా చేసే ఛాన్స్ ఉంది.
భారీ బడ్జెట్ చిత్రాలకు పెట్టింది పేరు లైకా ప్రొడక్షన్స్. ప్రస్తుతం ఈ సంస్థ భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా 2.0 సినిమాను నిర్మిస్తోంది.
ఇప్పుడీ సంస్థ బాహుబలి-2 లాంటి చరిత్రను అందించిన రాజమౌళితో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ బ్యానర్ కు చెందిన క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగంతో రాజమౌళి భేటీ అవ్వడం పుకార్లకు మరింత బలం చేకూర్చింది.
అగ్రిమెంట్ ప్రకారం డీవీవీ దానయ్యకు ఓ సినిమా చేయాలి రాజమౌళి. మరి దానయ్యతో సినిమా కంప్లీట్ అయిన తర్వాత లైకా ప్రొడక్షన్స్ కు సినిమా చేసి పెడతారా.. లేక లైకా ప్రొడక్షన్స్, దానయ్య సంయుక్తంగా రాజమౌళితో సినిమా చేస్తారా అనే విషయం తేలాల్సి ఉంది. బాహుబలి విషయంలో కూడా భారీ బడ్జెట్ మూవీ కావడం వల్ల దానయ్యను పక్కన పెట్టాడు రాజమౌళి.