ఇన్నాళ్లు జనం అనుకున్నది ఒకటి. ఇప్పుడు ఆమె చెబుతున్నది మరొకటి. ఇదంతా ఆత్మహత్య చేసుకుని మరణించిన ఉదయ్ కిరణ్ సంగతే. ఉదయ్ కిరణ్ గురించి ఇన్నాళ్లు జనం అనుకుంటున్నది ఏమిటి?
అతగాడితో తన కుమార్తె వివాహాన్ని చిరంజీవే రద్దుకు చేసుకున్నారని, ఆ తరువాత ఉదయ్ కెరీర్ కూడా చిరు వల్లే ఇబ్బందుల్లో పడిందని ఇన్నాళ్లు అందరూ అంటూ, అనుకుంటూ వచ్చారు.
కానీ కానే కాదు అంటున్నారు ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి. అసలు తన సోదరుడు ఉదయ్ వేరే అమ్మాయితో బ్రేక్ అప్ అయి, డిప్రెషన్ లో వుంటే, చిరంజీవే ఆదుకుని, ధైర్యం చెప్పి, తన కుమార్తెను వివాహం చేసుకోమన్నారని వెల్లడించారు. చిరు కుమార్తెతో వివాహాన్ని కూడా ఉదయ్ నే క్యాన్సిల్ చేసుకున్నాడన్నారు.
ఇప్పుడు ఎవరో అడిగారని ఇన్ని విషయాలు చెప్పిన సోదరి, గత ఇన్నేళ్లలో ఈ విషయమై ఎందుకు పెదవి విప్పనట్లో? ఏమైనా ఇన్నాళ్లకు ఉదయ్ కిరణ్ విషయంలో చిరు ఫ్యామిలీకి ఓ క్లీన్ సర్టిఫికెట్ లభించింది.