రజనీ సినిమాను అడ్డుకుంటారా?

ఈ సంక్రాంతికి వస్తున్నట్లు ప్రకటన వచ్చేసింది సూపర్ స్టార్ రజనీకాంత్ పెట్టా మూవీ గురించి. అంతకు ముందు రావడంలేదు, వాయిదా లాంటి వార్తలు వినిపించాయి. అయితే పెట్టా తెలుగు హక్కులు కొన్న నిర్మాత సంక్రాంతికి…

ఈ సంక్రాంతికి వస్తున్నట్లు ప్రకటన వచ్చేసింది సూపర్ స్టార్ రజనీకాంత్ పెట్టా మూవీ గురించి. అంతకు ముందు రావడంలేదు, వాయిదా లాంటి వార్తలు వినిపించాయి. అయితే పెట్టా తెలుగు హక్కులు కొన్న నిర్మాత సంక్రాంతికి వస్తున్నట్లు ప్రకటించారు.

వాస్తవానికి సంక్రాంతి సీజన్ కు డబ్బింగ్ సినిమాలు అనుమతించకూడదని గతంలో తెలుగు నిర్మాతలు ఓ నిర్ణయం తీసుకున్నారు. పెట్టా సినిమా కనుక జనవరి మూడోవారంలో విడుదల అంటే తాను కచ్చితంగా అభ్యంతరం చెబుతా అని, చాంబర్ ను ఆశ్రయిస్తానని, నిర్మాత బోగవిల్లి ప్రసాద్ అంటున్నట్లు తెలుస్తోంది.

అఖిల్ హీరోగా ఆయన నిర్మించిన మిస్టర్ మజ్ఞు సినిమా విడుదలను జనవరి 25కు ప్లాన్ చేసుకున్నారు. అదేరోజు కళ్యాణ్ రామ్ 118 విడుదలయ్యే అవకాశం వుంది. మరీ ఎక్కువ సినిమాలు ప్లానింగ్ లో వుంటే కళ్యాణ్ రామ్ సినిమా వుండకపోవచ్చు.

సంక్రాంతికి మూడు భారీ తెలుగు సినిమాలు వున్నాయి. మూడోవారానికి రెండు మూడు సినిమాలు వున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పెట్టా సినిమాను విడుదల చేయడానికి తెలుగు నిర్మాతలు ఊ అంటారా? లేక అడ్డుకుంటారా? అన్నది అనుమానం గా వుంది.

అయితే చివరి నిమిషం వరకు కాకుండా ముందుగానే ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలని తెలుగు సినిమాల నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

జగన్ కు ఇప్పటి వరకూ ఒక కథ, ఇక అసలు కథ! ఈవారం స్పెషల్ స్టోరీ 

భేకార్ మాటల్.. థియేటర్స్ గుప్పిట్లో పెట్టుకుని డ్యాన్స్ ఏస్తామా