పాపం, హీరో సునీల్ ను పరాజయాలు వెన్నాడుతున్నాయి. కమెడియన్ గా వుంటూ, కష్టపడి సిక్స్ ప్యాక్ చేసి, డ్యాన్స్ లు నేర్చుకుని, హీరోగా మారాడు. ఒకటి రెండు హిట్ లు కొట్టినా, ఆ తరువాత వరుసగా పరాజయాలే పలకరించాయి. వన్ ఫైన్ మార్నింగ్ డెసిషన్ తీసుకుని మళ్లీ కమెడియన్ గా మారాడు.
కమెడియన్ అయ్యాక ఇంక కసరత్తులు ఎందుకుని మానేసేడో ఏమిటో? ఇప్పుడు విపరీతంగా లావు అయినట్లు కనిపిస్తున్నాడు. పోనీ ఆ సంగతి అలా వున్నా, మాంచి రెమ్యూనిరేషన్ తో మంచి చాన్స్ లు వచ్చాయి అనుకుంటే, చేసిన మూడు సినిమాల్లో కూడా సునీల్ కు పేరు రాలేదు.
అరవింద సమేత, అమర్ అక్బర్ ఆంథోని, పడి పడి లేచె మనసు, ఈ వరుస ఎలా వుందో, ఆ సినిమాల్లో సునీల్ పాత్రలు కూడా అలాగే వున్నాయి. పడి పడి లేచె మనసు సినిమాలో సునీల్ ను చూసిన వారికి విపరీతమైన ఆశ్చర్యం కలిగింది. లావుగా వుండడం, కదలలేకపోవడం, కామెడీ చేయలేకపోవడం చూసి, అయ్యో అనుకోని వారు లేరు.
హీరోగా కాకుండా కమెడియన్ గా నైనా కొనసాగుతాడేమో అనుకుంటే, ఈ సినిమాలు, వాటిలో అతగాడి నటన, వీటన్నింటికి తోడు సునీల్ డిమాండ్ చేసే రెమ్యూనిరేషన్ అన్నీ కలిసి, ఇక సరైన పాత్రలు పడతాయా? అని అనుమానం కలిగిస్తున్నాయి.
జగన్ కు ఇప్పటి వరకూ ఒక కథ, ఇక అసలు కథ! ఈవారం స్పెషల్ స్టోరీ
భేకార్ మాటల్.. థియేటర్స్ గుప్పిట్లో పెట్టుకుని డ్యాన్స్ ఏస్తామా