ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ వయసు మీద పడినా కూడా వన్ బై వన్ సినిమాలు చేస్తూనే వస్తున్నారు. అయితే తెలుగు దర్శకులతో రజనీ సినిమా అన్నది చాలా కాలంగా సాధ్యపడడం లేదు.
ఇప్పుడు ఆ అవకాశం కాస్త కనిపిస్తోంది. ఓ తెలుగు దర్శకుడు చెప్పిన లైన్ రజనీ కి నచ్చినట్లు తెలుస్తోంది. అయితే అంత మాత్రం చేత సినిమా అదిగో అని ఫిక్స్ అయిపోనక్కరలేదు. ఎందుకంటే కథ చెప్పడం దగ్గర నుంచి సినిమా స్టార్ట్ కావడానికి మధ్య చాలా అంటే చాలా వుంటుంది.
అయితే ఇంతకీ ఇప్పుడు విషయం ఏమిటంటే ఈ మధ్యనే బింబిసార సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన వాశిష్ణ నేరుగా రజనీ కే కథ చెప్పేసారు. లైన్ బాగుందని రజనీ మెచ్చుకున్నారు కూడా. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే అంతకన్నా ముందుగా బింబిసార 2 సినిమా పూర్తి చేయాల్సిన కమిట్ మెంట్ వాశిష్ట మీద వుంది. వేరే రెండు సినిమాలు పూర్తి చేయాల్సిన బాధ్యత రజనీ మీద వుంది. అప్పుడు కానీ ఈ కాంబినేషన్ పాజిబుల్ కాదు.
అన్నీ అనుకున్నట్లు జరిగితే చాలా పాపులర్ అయిన బడా నిర్మాత ఈ సినిమాను తెలుగు-తమిళ భాషల్లో నిర్మిస్తారు. బింబిసార 2 స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ లోగా కళ్యాణ్ రామ్ కూడా రెండు సినిమాలు విడుదల చేస్తారు.