అభిమానుల రాజకీయాలకు రజనీ మద్దతిస్తాడా?!

ఒకవైపు భారతీయ జనతా పార్టీ వాళ్లు ఎంతగా ట్రై చేసినా ప్రయోజనం కనపడలేదు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రాలేదు. లింగా ఆడియో విడుదల వేడుక సందర్భంగా తను రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు లేవని దాదాపుగా స్పష్టం…

ఒకవైపు భారతీయ జనతా పార్టీ వాళ్లు ఎంతగా ట్రై చేసినా ప్రయోజనం కనపడలేదు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రాలేదు. లింగా ఆడియో విడుదల వేడుక సందర్భంగా తను రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు లేవని దాదాపుగా స్పష్టం చేశాడు. తమిళనాడులోని ప్రాంతీయ పార్టీలు అవినీతి కూపంలో కూరుకుపోయిన నేపథ్యంలో రాజకీయ శూన్యత ఉందని.. రజనీ రాజకీయాల్లోకి వస్తే ప్రయోజనం ఉంటుందని బీజేపీ వాళ్లు లెక్కలేసి చూపించినా రజనీ అయితే రాజకీయాల పట్ల ఆసక్తిని చూపలేదు.

మరి ఆయన సంగతి అలా ఉంటే.. ఇప్పుడు రజనీకాంత్ అభిమాన సంఘం ఒకటి రాజకీయ ఆరంగ్రేటం చేయనుందట. డిసెంబర్ 12 న అభిమాన సంఘం అధ్యక్షుడు పార్టీ పేరును, గుర్తును ప్రకటించనున్నాడట! 

మరి ఇలా అభిమాన సంఘం రాజకీయాలకు రజనీ మద్దతు ఉంటుందా? అనేది అనుమానమే! రజనీకాంత్ బొమ్మను పెట్టుకొని అభిమాన సంఘం వాళ్లు రాజకీయం చేస్తే.. దానికి రజనీ మద్దతు లభించకపోవచ్చు!

వెనుకటికి బీజేపీ వాళ్లు కూడా రజనీకాంత్ బొమ్మను పెట్టుకొనే ప్రయత్నం చేశారు. ఆ తీరును రజనీకాంత్ కుటుంబం సున్నితంగా ఖండించింది. రజనీ భార్య మీడియా ముందుకు వచ్చి సూపర్ స్టార్ బొమ్మను వాడుకోవద్దని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అభిమానుల పార్టీ పట్ల రజనీ ఏ విధంగా స్పందిస్తారో!