Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రాజుగాడు డేట్ వచ్చేసింది

రాజ్ తరుణ్-ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ సిరీస్ లో తయారైన నాలుగో సినిమా రాజుగాడు. ఈ సినిమా సంక్రాంతికే విడుదల కావాల్సింది. కానీ డేట్ లు సెట్ కాక వాయిదా పడుతూ వచ్చింది.

ఆఖరికి ఇప్పుడు మే 11న డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజూగాడు టీజర్ ను బయటకు వదిలారు. ఫక్తు సరదా సరదా సినిమాగా, రాజ్ తరుణ్ కు టైలర్ మేడ్ సినిమాలా కనిపిస్తోంది. టీజర్ లో వున్న కాసిన్ని డైలాగులు కూడా బాగానే పండాయి.

రాజేంద్రప్రసాద్ కాంబినేషన్ లో నవ్వులు పండించడం రాజ్ తరుణ్ కి ఇది మొదటి సారి కాదు. ఆ ఇద్దరి కాంబినేషన్ బాగానే వుంటుంది. తనకు తెలియకుండానే దొంగతనం చేసే జబ్బు వున్న కుర్రాడికి రాజ్ తరుణ్ నటిస్తున్నాడు. సంజన రెడ్డి అనే మీడియా నుంచి సినిమాల్లోకి వెళ్లిన మహిళ ఈ సినిమాకు దర్శకురాలు.

ఈ సినిమాకు మే 11డేట్ ప్రకటించారు. నిజానికి ఈ డేట్ కాస్త టఫ్ వ్యవహారమే. ఈ డేట్ కు కాస్త ముందు నా పేరు సూర్య, మహానటి లాంటి సినిమాలు వున్నాయి. ఇదే డేట్ కు బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం సినిమా వుంది. ఈ డేట్ కు కాస్త అటుగా మరికొన్ని సినిమాలు వున్నాయి.

మరి వాయిదా వేసి వేసి, ఇలాంటి డేట్ ఎందుకు ఫిక్స్ ఛేసుకున్నట్లో ?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?