Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ సినిమాకు ఆ టైటిల్ సూపర్

ఆ సినిమాకు ఆ టైటిల్ సూపర్

సినిమాకు చాలా వరకు సరిపోయే టైటిల్ నే పెడతారు. టాప్ హీరోల సినిమాలు అయితే మాత్రం వ్యవహారం వేరుగా వుంటుంది. నారా రోహిత్ ప్రతిష్టాత్మకంగా ఫీలవుతున్న ఓ సినిమాకు ఈరోజు శ్రీకారం చుడుతున్నారు.

ఆ సినిమాను ఈరోజు అమరావతిలో రోహిత్ కజిన్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నాయుడు ముఖ్య అతిథిగా ప్రారంభిస్తున్నారు. ఈ సినిమాలో నారా రోహిత్ మూగవాడి పాత్ర పోషిస్తున్నారు.

తెలుగు తెరపై పూర్తి స్థాయిలో హీరో మూగవాడిగా కనిపించడం ఇదే ప్రథమం. గతంలో హీరోయిన్ జయప్రద చేసింది. వెంకీ కాస్సేపు ఓ సినిమాలో మూగవాడిగా కనిపించాడు.

కానీ నారా రోహిత్ పూర్తిగా మూగవాడిగా నటించబోతున్నాడు. ఈ సినిమాకు టైటిల్ శబ్ధం. మూగవాడి సినిమాకు టైటిల్ శబ్దం అంటే సూపరే కదూ. పైగా అతని మౌనమే అతని ఆయుధం అన్నది ట్యాగ్ లైన్.

నిజానికి కొన్నాళ్లుగా రోహిత్ ప్రయోగాలకు దూరంగా వుంటూ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కానీ ప్రతిధ్వని, సోలో తరువాత సరైన సినిమా పడలేదు. అందుకే తనకు నచ్చిన, అచ్చి వచ్చిన రూట్లోనే మళ్లీ విజయాల కోసం వెదికే పనిలో పడినట్లు కనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?