Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహానటి మే 9న విడుదల

మహానటి మే 9న విడుదల

ఈ మధ్యకాలంలో సినిమా జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో మహానటి ఒకటి. ఈ సినిమా ఏప్రియల్ 30 అని డేట్ గతంలో ఇచ్చారు. అయితే పనులు పూర్తికావడం ఆలస్యమైంది. దాంతో వాయిదా పడుతుందని, పడదని ఇలా రకరకాల వార్తలు బయటకు వచ్చాయి. ఆఖరికి ఇప్పుడు అఫీషియల్ డేట్ వస్తోందని తెలుస్తోంది.

మే 9న మహానటి సినిమాకు డేట్ ఇవ్వబోతున్నారు. అంటే సరైన సమ్మర్ టైమ్ లో మహానటి సినిమా విడుదల కాబోతోంది. ఆ సినిమాకు కాస్త ముందుగా అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా విడుదల కాబోతోంది. అది కూడా కాస్త సీరియస్ ఎమోషనల్ సినిమానే. అయితే ఇది బయోపిక్. అది క్యారెక్టర్ బేస్డ్ మూవీ.

మహానటిలో తెలుగు, తమిళ, మళయాల నటులు చాలామంది వున్నారు. ఒకప్పటి హీరోయిన్ సావిత్రి అంటే ఇప్పటికీ అభిమానిస్తూ, గుర్తుంచుకున్న వారు, ముఖ్యంగా మహిళలు చాలామంది వున్నారు. వారంతా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. పైగా మాయాబజార్ లోని వివాహ భోజనంబు పాట, ఆ సెట్ అదీ ఈ సినిమా కోసం రీ క్రియేట్ చేస్తున్నారు. అవన్నీ కాస్త ఆసక్తికరమైన సంగతులే.

ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి వైవిధ్యమైన సినిమాను అందించిన నాగ్ అశ్విన్ ఈ సినిమాను వైజయంతీ మూవీస్ పతాకంపై అందిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?