‘‘సర్వే సాధుజనాస్సుఖినో విలసంతు’’

విళంబ నామ సంవత్సర ఉగాది Advertisement సర్వజనులకూ సకల శుభాలను చేకూర్చాలి… అధికారంలోకి ఎవరు వచ్చినా సరే… వారు స్వార్థ రహితులై లోక కల్యాణానికై… సమాజానికి మంచి చేయడానికై పనిచేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల…

విళంబ నామ సంవత్సర ఉగాది

సర్వజనులకూ సకల శుభాలను చేకూర్చాలి…

అధికారంలోకి ఎవరు వచ్చినా సరే… వారు స్వార్థ రహితులై లోక కల్యాణానికై… సమాజానికి మంచి చేయడానికై పనిచేయాలి.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన సయోధ్య ఉండాలి.

ఎవ్వరూ ఎలాంటి వంచనా శిల్పంతో కూడిన నాటకాలు ఆడకుండా.. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలను లక్ష్యించి.. ప్రజలను పావులుగా వాడుకుంటూ..  వారి జీవితాలతో శ్రేయస్సుతు ఆడుకుంటూ.. వారి మనో వాంఛలను తుంగలో తొక్కుతూ చెలరేగకుండా సద్బుధ్దులను వారికి ప్రసాదించాలి.

అర్హమైన వారు మాత్రమే అధికారపీఠం లోకి రావాలి.

ప్రజలను తప్పుదోవ పట్టించే పరస్పర నిందారోపణలు తగ్గాలి.

స్వచ్ఛంగా సౌశీల్యంగా మాట్లాడే ధోరణి పెరగాలి. మొత్తంగా సమాజానికి మంచి జరగాలని… గ్రేటాంధ్ర అభిలషిస్తోంది.

దేశోయం నిరుపద్రవోఽస్తు,

సర్వే సాధుజనాస్సుఖినో విలసంతు,

సమస్తసన్మంగళాని సంతు,

ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు,

సకలకళ్యాణ సమృద్ధిరస్తు. హరిః ఓం.

 

అందరికీ విళంబ నామ సంవత్సర శుభాకాంక్షలు

.. వెంకట్ ఆరికట్ల