పవన్‌కళ్యాణ్ రాజకీయ పరంగా వేస్తోన్న అడుగులకి మెగా ఫ్యామిలీ యువ హీరోల నుంచి ఫుల్ సపోర్ట్ లభిస్తోంది. పవన్ ఎప్పుడు ఏమి చేసినా విధిగా తమ సపోర్ట్‌ని తెలియజేస్తున్నారు చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్. 'చెప్పను బ్రదర్' అంటూ పవన్‌తో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తోన్న అల్లు అర్జున్ మాత్రం పట్టనట్టే వుంటున్నా కానీ వీరు ముగ్గురూ మాత్రం పవన్‌కి సోషల్ మీడియా ద్వారా అన్‌కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నారు.
కాంగ్రెస్‌లో కొనసాగుతున్న చిరంజీవి ఇంతవరకు తమ్ముడి నిర్ణయాల పట్ల ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. తండ్రి అభిమతం ఏమిటనేది తెలిసినప్పటికీ బాబాయ్ తీసుకునే నిర్ణయాలకి చరణ్ తన వంతు సహకారం అందిస్తూనే వున్నాడు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగుతోన్న పవన్ ప్రస్తుతం జనసేనని ఒంటరిగానే ముందుకు తీసుకెళుతున్నాడు.
పవన్ మినహా మరో ఆకర్షణ లేని జనసేన ప్రచార పర్వంలో చరణ్‌తో పాటు మిగిలిన మెగా హీరోలు కూడా భాగం పంచుకుంటారా అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రజారాజ్యం టైమ్‌లో చరణ్ కూడా ప్రచారంలో పాల్గొన్నాడు.
మరి పవన్ తన సోదరీ సోదరుల పుత్రుల నుంచి ప్రత్యక్ష సహకారం ఆశిస్తాడో లేక వారిని దూరంగా వుండమంటాడో ఇంకా తెలియదు. తెలుగుదేశంకి వ్యతిరేక స్వరం వినిపించిన అనంతరం పవన్‌పై రాజకీయ దాడి మొదలైంది. ఈ టైమ్‌లో అతనికి కుటుంబం నుంచి నైతిక మద్దతు అవసరమే మరి.