రాజుగారి గదిలో కాజల్?

నాగ్-సమంత-వెన్నెల కిషోర్ కాంబోలో తయారయిన రాజుగారి గది 2 సినిమా గురించి కాస్త పాజిటివ్ వార్తలే వినిపిస్తున్నాయి. సినిమాలో క్లయిమాక్స్ పీక్స్ లో వుంటుందని, జనం దానికి బాగా కనెక్ట్ అవుతారని టాక్ వినిపిస్తోంది.…

నాగ్-సమంత-వెన్నెల కిషోర్ కాంబోలో తయారయిన రాజుగారి గది 2 సినిమా గురించి కాస్త పాజిటివ్ వార్తలే వినిపిస్తున్నాయి. సినిమాలో క్లయిమాక్స్ పీక్స్ లో వుంటుందని, జనం దానికి బాగా కనెక్ట్ అవుతారని టాక్ వినిపిస్తోంది. ఇదిలా వుంటే ఈ సినిమాలో సమంత దెయ్యంగా కనిపిస్తుందని మొదట్నించీ వార్తలు వినిపిస్తున్నాయి. దానిని నాగ్ కన్ ఫామ్ చేసాడు కూడా.

అయితే మరో వార్త కూడా వినిపిస్తోంది. ఇది ఎంత వరకు నిజమో, సినిమాకు బజ్ తేవడానికి బయట చక్కర్లు కొడుతోందో తెలియదు. ఆ వార్త ఏమిటంటే, సినిమాలో గ్లామరస్ హీరోయిన్ కాజల్ కూడా ఓ గెస్ట్ పాత్రలో కనిపిస్తుందన్నది. కాజల్ కూడా ఈ సినిమాలో దెయ్యంగా కనిపిస్తుందని టాక్ వినిపిస్తోంది.

అయితే యూనిట్ వర్గాలు ఈ వార్తను కన్ ఫామ్ చేయడం లేదు. ఒకవేళ నిజమే అయితే మాత్రం సినిమాకు ఏడెడ్ అడ్వాంటేజ్ అవుతుందన్నది వాస్తవం. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పివిపి నిర్మాత.