రాక్షసన్ సినిమాను రాక్షసుడుగా కలర్ జిరాక్స్ చేసి హిట్ కొట్టారు. ఆ ఊపుతో రాక్షసుడు 2 అనే స్వంత కథను తయారుచేసుకున్నారు దర్శకుడు రమేష్ వర్మ. మ్యూజిక్ డైరక్టర్ డిఎస్పీ సోదరుడు సాగర్ ఈ కథకు సహరచయిత. ఇప్పుడు ఈ కథను పాన్ ఇండియా సినిమాగా చేసే ప్రయత్నం ప్రారంభమైంది.
అందుకోసం ఓ బాలీవుడ్ హీరోను సంప్రదించినట్లు బోగట్టా. బాలీవుడ్ హీరోతో పాటు తమిళ సంచలన నటుడు విజయ్ సేతుపతి కూడా నటించబోతున్నారని బోగట్టా.
ఆ విధంగా అటు నార్త్, ఇటు సౌత్ కవర్ చేసేసారు. మంచి ముహర్తం చూసి ఆ బాలీవుడ్ నటుడి పేరు రివీల్ చేస్తారని తెలుస్తోంది. తెలుగు హీరో హవీష్ కూడా ఓ పాత్ర పోషించే అవకాశం వుంది.
కోనేరు సత్యనారాయణ నిర్మించే ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకుడు. ప్రస్తుతం ఈ నిర్మాత, ఈ డైరక్టర్ కలిసి రవితేజ తో ఖిలాడీ సినిమా చేస్తున్నారు. దాని తరువాత ఈ సినిమా వుంటుంది.