విజయ్ దేవరకొండ, రష్మిక హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా డియర్ కామ్రేడ్. దక్షిణాది 4 భాషల్లో ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఓ ఫైట్ సీన్, మరో ముద్దు సీన్ మాత్రమే ఉన్న ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆల్ మోస్ట్ అన్ని భాషల్లో క్లిక్ అయింది. అయితే కన్నడలో ఓ హీరో ఫ్యాన్స్ మాత్రం ఈ టీజర్ ను జీర్ణించుకోలేకపోతున్నారు.
అవును.. శాండిల్ వుడ్ లో రక్షిత్ ఫ్యాన్స్ కు డియర్ కామ్రేడ్ టీజర్ నచ్చలేదు. వాళ్లు ఈ టీజర్ పై పెద్ద ట్రోలింగ్ షురూ చేశారు. వాళ్లకు ఈ టీజర్ లో నచ్చని ఒకే ఒక్క అంశం.. రష్మికను విజయ్ దేవరకొండ ఘాటుగా ముద్దాడ్డమే. గతంలో రష్మిక-రక్షిత్ ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. వాళ్ల వ్యవహారం ఎంగేజ్ మెంట్ వరకు వెళ్లింది. అయితే ఎంగేజ్ మెంట్ తర్వాత పెళ్లి కాన్సిల్ అయింది.
రక్షిత్ ను తను పెళ్లి చేసుకోవడం లేదంటూ రష్మిక స్వయంగా ప్రకటించింది. అప్పట్నుంచి ఆమెపై రక్షిత్ ఫ్యాన్స్ కక్షకట్టారు. సోషల్ మీడియాలో రష్మికపై ఎప్పటికప్పుడు విరుచుకుపడుతూనే ఉన్నారు. ఇలాంటి టైమ్ లో విజయ్ దేవరకొండ, రష్మిక ముద్దు సీన్ బయటకు రావడంతో అస్సలు తట్టుకోలేకపోతున్నారు. అది కూడా సాదాసీదా ముద్దుకాదు.
ఓవైపు గీతగోవిందం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, మరోవైపు తన నిశ్చితార్థాన్ని రష్మిక రద్దు చేసుకోవడం ఒకేసారి జరిగాయి. ఆ టైమ్ లో రష్మికపై చాలా ట్రోలింగ్ నడిచింది. క్రేజ్ వచ్చింది కాబట్టి రక్షిత్ ను వదిలేసిందంటూ కన్నడ ప్రేక్షకులు ఆమెపై విరుచుకుపడ్డారు.
ఆ టైమ్ లో విజయ్ దేవరకొండ ఆమెకు సపోర్ట్ గా నిలిచాడు. మళ్లీ ఇన్నాళ్లకు అదే విజయ్ దేవరకొండ సినిమాతో రష్మికకు మళ్లీ తలనొప్పులు ప్రారంభమయ్యాయి.
కర్నూలు ఎంపీ సీటు YCPకి ఇబ్బందులు తప్పవు
సావిత్రి, క్రీడాకారుల సినిమా చూశారే! మరి ఎన్టీఆర్ దే ఎందుకిలా?