బిగ్ బాస్ వన్ ఎన్టీఆర్… టూ నాని, మరి త్రీ ఎవరు? కొన్నాళ్ల క్రితం వరకు మళ్లీ బిగ్ బాస్ గా ఎన్టీఆర్ పేరు వినిపించింది. ఆయనకు కూడా అంగీకారమే. మంచి రెమ్యూనిరేషన్ కూడా ఆపర్ చేసారు. కానీ అన్నీ బాగానే వున్నా, ఆర్ఆర్ఆర్ సినిమా అడ్డంపడింది. ఎలా లెక్కలు వేసినా, బిగ్ బాస్ చేయడం కుదరడంలేదు. దాంతో ఎన్టీఆర్ నో చెప్పకతప్పలేదు.
అయితే మరి అలా అని బిగ్ బాస్ షో ఆపేస్తారా? లేదా మళ్లీ అదే షో చేసే ధైర్యం నాని చేస్తారా? ఈ రెండూ కాదు. కింగ్ నాగార్జున ఈసారి బిగ్ బాస్ అవతారం ఎత్తబోతున్నారు అని తెలుస్తోంది. మా టీవీలో మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని తన స్టయిల్ లో చేసి శహభాష్ అనిపించుకున్నారు.
నిజానికి కౌన్ బనేగా కరోర్ పతి కార్యక్రమాన్ని నాగ్ ఈ మేరకు చేసి రక్తి కట్టించగలరని ఎవరూ అనుకోలేదు. అలాగే నాగ్ తరువాత మెగాస్టార్ చిరంజీవి ట్రయ్ చేసి విఫలమయ్యారు. అలా తనకంతూ స్వంత స్టయిల్ తయారుచేసుకుని, కార్యక్రమాన్ని రక్తి కట్టించగల నాగ్, బిగ్ బాస్ ను కూడా పండించగలరని మా టీవీ క్రియేటివ్ టీమ్ నమ్ముతోందని తెలుస్తోంది.
ఈ మేరకు డిస్కషన్లు ఆరంభమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగ్ రెండు సినిమాలు టేకప్ చేసారు. అవి రెండూ స్వంత సినిమాలే. అందువల్ల ఆయన తన డేట్ లను ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేయగలరు కూడా. ఈ విషయంలో మరిన్ని అప్ డేట్ లు త్వరలో తెలిసే అవకాశం వుంది.
కర్నూలు ఎంపీ సీటు YCPకి ఇబ్బందులు తప్పవు
సావిత్రి, క్రీడాకారుల సినిమా చూశారే! మరి ఎన్టీఆర్ దే ఎందుకిలా?