కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన సినిమా 118. ఈ సినిమా ఒక విధంగా నాన్ సీజన్ లో విడుదలయింది. కానీ అదే నాన్ సీజన్ ఆ సినిమా పాలిట వరమయింది. స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ అన్నట్లుగా, ఏ సినిమా కూడా పోటీలేకుండా అలా స్లోగా షేర్ తెచ్చుకుంటూ మంచి లాభాలు ఆర్జించింది. మొత్తం 17 రోజుల రన్ కు తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది కోట్ల వరకు వసూళ్లు సాగించింది.
సినిమాను తెలుగు రాష్ట్రాల మేరకు అయిదున్నర కోట్ల దగ్గర మొత్తానికి నాన్ రికవరబుల్ అడ్వాన్స్ పద్దతిన పంపిణీకి ఇచ్చారు. ఇప్పుడు దానికి అదనంగా నాలుగుకోట్ల షేర్ వచ్చింది. అంటే నిర్మాత మహేష్ కోనేరుకు ఎలా లేదన్నా మూడుకోట్ల షేర్ ఓవర్ ఫ్లోస్ రూపంలో వస్తుందన్నమాట. ఇదికాక స్వంతానికి వుంచుకున్న ఓవర్ సీస్ లో ఓ నలభైలక్షల మేరకు షేర్ వచ్చింది. ఇంక రెస్టాఫ్ ఇండియా వుండనే వుంది.
17 రోజుల కలెక్షన్ల వివరాలు.
నైజాం…………………3.84 కోట్లు
సీడెడ్………………….1.20
వైజాగ్………………….1.14
కృష్ణ……………………0.76
గుంటూరు…………….0.68
నెల్లూరు………………..0.23
ఈస్ట్…………………….0.57
వెస్ట్……………………..0.45
కర్నూలు ఎంపీ సీటు YCPకి ఇబ్బందులు తప్పవు
సావిత్రి, క్రీడాకారుల సినిమా చూశారే! మరి ఎన్టీఆర్ దే ఎందుకిలా?