సినిమా రిలీజ్ కు ముందే పాసయ్యాడు

తండేల్ సినిమా ఫైనల్ కాపీ అల్లు అరవింద్ చూశారు. సినిమా బాగుందని మెచ్చుకున్నారు. దీంతో బన్నీ వాస్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమా ‘తండేల్’. వచ్చేవారం థియేటర్లలోకి రాబోతోంది. ఈ మూవీకి సంబంధించి తను ఆల్రెడీ పాస్ అయినట్టు ప్రకటించుకున్నాడు నిర్మాత బన్నీ వాస్.

గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై తెరకెక్కుతున్న తండేల్ సినిమాకు నిర్మాత బన్నీ వాస్. ఈ మూవీకి అల్లు అరవింద్ ప్రజెంటర్. ఎప్పుడు అరవింద్ కు సినిమా చూపించాల్సి వచ్చినా పదో తరగతి పరీక్షలు రాసి, రిజల్ట్ కోసం వెయిట్ చేసే చిన్న పిల్లాడిలా తను మారిపోతానని, తండేల్ విషయంలో కూడా అదే జరిగిందని అన్నాడు బన్నీ వాస్.

తండేల్ సినిమా ఫైనల్ కాపీ అల్లు అరవింద్ చూశారు. సినిమా బాగుందని మెచ్చుకున్నారు. దీంతో బన్నీ వాస్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తను డిస్టిక్షన్ లో పాస్ అయ్యానని, అల్లు యూనివర్సిటీ డీన్ అయిన అరవింద్ నుంచి సర్టిఫికేట్ వచ్చిందని చెప్పుకొచ్చాడు.

ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలున్నాయి. టీజర్, సాంగ్స్ హిట్టవ్వడం సినిమాకు ప్లస్ అయింది. మరీ ముఖ్యంగా నాగచైతన్య-సాయిపల్లవి హిట్ కాంబోను తెరపై చూసేందుకు మరోసారి ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.

ఫిబ్రవరి 7వ తేదీన తండేల్ ను రిలీజ్ చేయబోతున్నారు. రేపు ట్రయిలర్ లాంచ్ చేస్తారు. చందు మొండేటి డైరక్ట్ చేసిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

3 Replies to “సినిమా రిలీజ్ కు ముందే పాసయ్యాడు”

  1. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.