హరిహరా.. నితిన్ ఇప్పుడెలా?

ఈరోజు హరిహర వీరమల్లు యూనిట్ నుంచి మరోసారి మార్చి 28 రిలీజ్ అంటూ పోస్టర్ పడింది. దీంతో రాబిన్ హుడ్ కు షాక్ తగిలింది.

“మార్చి 28.. రాబిన్ హుడ్ రిలీజ్”.. ఎప్పుడైతే నితిన్ సినిమా నుంచి ఇలా రిలీజ్ డేట్ వచ్చిందో వెంటనే ‘హరిహర వీరమల్లు’ సినిమా వాయిదా పడిందని అంతా ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే, పవన్ సినిమా బరిలో ఉందని తెలిసి నితిన్ పోటీకి రాడు కదా. పైగా పవన్ కు తనే మొదటి వీరాభిమానినని, తన తర్వాతే ఎవరైనా అని చెప్పుకునే నితిన్, అతడిపైనే పోటీకి వెళ్తాడని ఎవ్వరూ అనుకోరు కదా.

కాబట్టి హరిహర వీరమల్లు సినిమా దాదాపు వాయిదా పడినట్టేనని అంతా అనుకున్నారు. కట్ చేస్తే, ఈరోజు యూనిట్ నుంచి మరోసారి మార్చి 28 రిలీజ్ అంటూ పోస్టర్ పడింది. దీంతో రాబిన్ హుడ్ కు షాక్ తగిలింది.

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి ఈరోజు బాబీ డియోల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కత్తి దూస్తున్న ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ ను చూపించారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ, పోస్టర్ కింద మార్చి 28 రిలీజ్ అంటూ ప్రకటించారు.

దీంతో మరోసారి రిలీజ్ డేట్ పై చర్చ మొదలైంది. నిజంగా హరిహర వీరమల్లు చెప్పిన తేదీకి వస్తే నితిన్ సినిమాను మరోసారి వాయిదా వేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. ఇప్పటికే క్రిస్మస్ నుంచి వాయిదాపడి మార్చి నెలకు షిఫ్ట్ అయిన ఈ సినిమా, మరో నెలను వెదుక్కోవాల్సి ఉంటుంది.

ఈ సంగతి పక్కనపెడితే.. పవన్ తో చర్చించకుండా మైత్రీ మూవీ మేకర్స్ అంత ధైర్యంగా రాబిన్ హుడ్ డేట్ వేయరు కదా. పైగా ఆ మరుసటి రోజే మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ కూడా ఉంది. ఎలా చూసుకున్నా ‘హరిహర..’పైనే అనుమానాలున్నాయి. వాళ్లేమో అస్సలు తగ్గట్లేదు.

3 Replies to “హరిహరా.. నితిన్ ఇప్పుడెలా?”

  1. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.