ఇలా మొదలై, అలా ముగిసిన వివాదం

ఛత్రపతి శివాజీ మహారాజ్ పై వచ్చిన ఛావా పుస్తకాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించామని, ఆయన ఘనతను ప్రపంచానికి చాటిచెప్పడమే తమ ఉద్దేశమని, ఎలాంటి వివాదాలు కోరుకోవడం లేదని స్పష్టంచేశారు.

అంతా ఊహించినట్టుగానే చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఛావా సినిమా చిక్కుల్లో పడింది. విక్కీ కౌశల్, రష్మిక హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం.. ఇలా వివాదాస్పదమై, అలా వెంటనే చల్లారిపోయింది. మేకర్స్ చొరవ ఫలించింది.

ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై మహారాష్ట్ర మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందుగా చరిత్రకారులకు సినిమా చూపించాలని, వాళ్లు సమ్మతం తెలిపిన తర్వాతే విడుదల చేయాలని, లేదంటే సినిమా రిలీజ్ ను అడ్డుకుంటామని విస్పష్టంగా ప్రకటించారు.

అంతేకాదు, శంభాజీ రాజే డాన్స్ సన్నివేశంపై కూడా మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. మహారాజా గౌరవానికి భంగం కలిగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. స్వయంగా ముఖ్యమంత్రి దీనిపై స్పందించడం, ఛత్రపతి గౌరవానికి భంగం కలిగించకుండా క్రియేటివిటీ వాడాలని సూచించడం జరిగింది.

అభ్యంతరాలు వ్యక్తమైన వెంటనే యూనిట్ రంగంలోకి దిగింది. సినిమా దర్శకుడు లక్ష్మణ్ ఉఠేకర్, రాజ్ ఠాక్రేను ప్రత్యేకంగా కలిశారు. అభ్యంతరం వ్యక్తమైన డాన్స్ సీన్ ను తొలిగించేందుకు అంగీకరం తెలిపారు.

మహారాష్ట్ర మంత్రులు, చరిత్రకారుల అభ్యంతరాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటామని.. మనోభావాలు కించపరిచే ఎలాంటి సన్నివేశాన్ని సినిమాలో ఉంచమని హామీ ఇచ్చింది యూనిట్. ఛత్రపతి శివాజీ మహారాజ్ పై వచ్చిన ఛావా పుస్తకాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించామని, ఆయన ఘనతను ప్రపంచానికి చాటిచెప్పడమే తమ ఉద్దేశమని, ఎలాంటి వివాదాలు కోరుకోవడం లేదని స్పష్టంచేశారు.

దీంతో ఛావా సినిమా చుట్టూ ఉన్న వివాదం గంటల వ్యవధిలోనే సమసిపోయింది. మహారాష్ట్ర మంత్రుల ఆందోళనలను పరిష్కరించడానికి, వాళ్ల కోసం, చరిత్రకారుల కోసం.. చిత్రనిర్మాతలు జనవరి 29న ప్రత్యేక ప్రీమియర్ షోను ఏర్పాటు చేశారు. ఈ సినిమాలో మహారాణి యేసుబాయి పాత్రలో రష్మిక నటించింది.

2 Replies to “ఇలా మొదలై, అలా ముగిసిన వివాదం”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.