దేవాన్ష్‌పై ప‌వ‌న్ ప్ర‌శంస‌.. ఇంత ఆల‌స్యం ఎందుకో?

ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇవాళ ఎక్స్ వేదిక‌గా దేవాన్ష్‌ను అభినందిస్తూ ఎందుకు పోస్టు పెట్టారో అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

పిల్ల‌లెవ‌రైనా ఏ రంగంలో అయినా ప్ర‌తిభ క‌న‌బ‌రిస్తే ప్రోత్స‌హించాలి. రాజ‌కీయాల‌కు అతీతంగా ఆలోచిస్తేనే ప్ర‌తిభావంతుల్ని వెలికి తీయొచ్చు. అయితే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి మ‌న‌వ‌డు నారా దేవాన్ష్ చెస్ ప‌జిల్స్ పూర్తి చేయ‌డంలో వ‌ర‌ల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు ద‌క్కించుకోవ‌డంపై డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎంతో ఆల‌స్యంగా స్పందించ‌డం గ‌మ‌నార్హం. గ‌త నెల‌లో రికార్డ్స్‌ను నెల‌కొల్ప‌గా, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇప్పుడు త‌న ఆఫీస్‌ ఎక్స్ ఖాతా వేదిక‌గా అభినందించ‌డం విశేషం.

మంత్రి నారా లోకేశ్‌ తనయుడు తొమ్మిదేళ్ల దేవాన్ష్.. చదరంగంలో 175 క్లిష్టమైన పజిల్స్‌ను రికార్డు స్థాయిలో 11 నిమిషాల 59 సెకన్లలోనే పూర్తిచేసి శ‌భాష్ అనిపించుకున్నాడు. ‘ఫాస్టెస్ట్‌ చెక్‌మేట్‌ సాల్వర్‌’గా వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో దేవాన్ష్‌కు చోటు ద‌క్కింది. గ‌త నెల (డిసెంబ‌ర్‌) 18న బుధ‌వారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో ఈ పోటీ నిర్వహించారు. లండన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నుంచి ఆదివారం దేవాన్ష్‌కు స‌ర్టిఫికెట్‌ అందింది.

అప్ప‌ట్లో అంద‌రూ దేవాన్ష్ ప్ర‌తిభ‌ను మెచ్చుకుంటూ వివిధ మాధ్య‌మాల వేదిక‌గా అభినంద‌న‌ల్ని వెల్లువెత్తించారు. కానీ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇవాళ ఎక్స్ వేదిక‌గా దేవాన్ష్‌ను అభినందిస్తూ ఎందుకు పోస్టు పెట్టారో అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ప‌వ‌న్ పోస్టు ఏంటో తెలుసుకుందాం.

“ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేశ్ త‌న‌యుడు, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి మ‌న‌వ‌డు చిరంజీవి నారా దేవాన్ష్ కేవలం 11 నిమిషాల 59 సెకండ్లలో 175 చెస్ పజిల్స్ పూర్తి చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పిన్న వయసులోనే చెస్‌లో అత్యుత్తమ ప్రతిభను కనబరచిన దేవాన్స్ భవిష్యత్తులో మరిన్ని రికార్డులు నెలకొల్పి, గ్రాండ్ మాస్టర్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప‌వ‌న్ పేర్కొన్నారు. దేవాన్ష్‌పై ప్ర‌శంస‌ను స్వాగతించాల్సిందే. అయితే ఇంత ఆల‌స్యం ఎందుక‌నేదే ఇప్పుడు ప్ర‌శ్న‌. ఎందుకంటే, గ‌త కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్ వ‌ర్సెస్ లోకేశ్ అనే చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌ధ్యంలో ఈ ట్వీట్ కాస్తా స్పెష‌ల్‌గా చెప్పుకోవ‌చ్చు.

11 Replies to “దేవాన్ష్‌పై ప‌వ‌న్ ప్ర‌శంస‌.. ఇంత ఆల‌స్యం ఎందుకో?”

  1. నిన్న రిపబ్లిక్ డే సందర్బంగా గవర్నర్ ఇచ్చిన తేనేటి విందులో లోకేష్ గారు దేవాన్ష్ సాధించిన ఘనత గురించి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా చెప్పారు . పవన్ కూడా దీనికి చాలా బాగా స్పందించి ఈ రోజు ఆఫీసియల్ గా విషెస్ చెప్పారు. ఇందులో అంత తప్పేముంది నీకు. ఏదో దొంగతనం, రంకు తనం జరిగిపోయినట్టు ఆ ఆర్టికల్ ఏంటమ్మా. మారవా నువ్వు ఈ జీవితం లో.

  2. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  3. నువ్వు చంద్రబాబు నాయుడుని పవన్ కళ్యాణ్ ని ఏ విధంగా తప్పుపట్టాలా అని ఆలోచనతో ఏడుస్తూ ఉంటావు. ఇంకా ఖాళీగా ఉంటే జగన్ రెడ్డి M గుడుస్తావ్. నీ బ్రతుకు మారదు

  4. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, ఎనిమిది, తొమ్మిది, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  5. రవి గారు, మేల్కొని మీ గౌరవాన్ని తిరిగి పొందండి!”

    రవి గారు, మీ ప్రవర్తన చూసి ఇప్పుడు నిజంగా ఒక్క ప్రశ్న తలెత్తుతోంది—మీ ఆలోచనల మీద మీరు పాస్వర్డ్ పెట్టేసారా? “బాస్ ఎప్పుడూ కరెక్ట్” అనే స్లోగన్‌తో జీవితాన్ని నడపడం ఏంటీ, రవి గారు? మీరు సింధబాద్ కథలోని జిన్నలా వాళ్లకో బాటిల్‌లో నక్కి బైటపడాలా అనిపిస్తోంది!

    మీరు జగన్ గారిని మద్దతు ఇస్తున్నారా? చాలని. కానీ అవినీతి ప్రస్తావన రాగానే, “ఇతర నాయకులూ అవినీతిపరులే” అని చెప్పడం… మీరు తప్పును సపోర్ట్ చేస్తున్నారా, మిగతావాళ్లను కూడా ఇంకొంచెం పైకి లాగుతున్నారా? ఇది లాజిక్ కాదు, రవి గారు, ఇది మిమ్మల్ని చెడ్డ సెటైర్‌గా మార్చేస్తోంది.

    మరి కులం ప్రస్తావన ఏంటి? ఇది ఏంటి, మీకు ఏం అవసరం లేకుండా చీప్ మ్యాటీరియల్ తో పని చేస్తూ మీ గౌరవాన్ని నీరుగార్చడం? రవి గారు, ఇది 2025, కులాలు కాదు, ఆలోచనలతో ప్రజలు ప్రగతిచేస్తారు. కానీ మీరు ఇంకా అక్కడే, ప్రాచీన యుగంలోనే కూర్చుని ఉంటే ఎలా?

    మీకు చెప్పాల్సిన నిజం ఏంటంటే—రాజకీయ నాయకులు తమ డబ్బుతో సహాయం చేయడం లేదు, ప్రజల డబ్బుతో చేస్తున్నారు. మీరు వాళ్ల సేవకుడిలా ప్రవర్తించడం వారికి ఆనందమే. కానీ ప్రజలముందు మీ గౌరవం పూర్తిగా దెబ్బతింటోంది.

    ఇప్పటికైనా మేల్కొనండి, రవి గారు! మీరు బానిసలా ప్రవర్తిస్తూ ఉంటే, మీను పాస్ట్‌ టెన్స్‌లో చూసే రోజులు దూరం కాదు. మీ ఆలోచనలకు “రీసెట్” కొట్టండి, కాస్త ప్రశ్నించండి, మరియు మీ గౌరవాన్ని తిరిగి పొందండి. జీవితం చిన్నది, రవి గారు, గర్వంగా, మీ స్వతంత్ర ఆలోచనలతో బతకండి—ఒక బాస్ ఆర్డర్స్ మెషిన్‌గా కాదు! 😄

Comments are closed.